నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
మాడ్గులపల్లి, నవంబర్ 1: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తిప్పర్తి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఏ-గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1960, బీ-గ్రేడ్‌కు రూ.1940 ధరను నిర్ణయించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అధికారుల సూచనలు పాటించి ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ తూనం శోభ, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, నాయకులు కందిమళ్ల నరేందర్‌రెడ్డి, కట్టా సిద్ధార్థరెడ్డి, స్టాలిన్ పాల్గొన్నారు.
తిప్పర్తి : మండంలోని తిప్పర్తి, కేశరాజుపల్లి, దుప్పలపల్లి, రాయినిగూడెం, రామలింగాలగూడెం, తానేదార్పల్లి, పజ్జూరు, మామిడాల గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతులకు అండగా ఉండి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు తక్కువ తేమశాతంతో ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ ముత్తినేని శ్యాంసుందర్, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్, డైరెక్టర్ వనపర్తి నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.