మహబూబ్‌నగర్, ఏప్రిల్ 4 : తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినిపించండని చెప్పడం ఏమిటని, కేంద్ర ప్రభుత్వానికి నూకలు తినిపిస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని సోమవారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి మంత్రి నిరసన వ్యక్తం చేశారు. ఒకే ట్యాక్స్.. ఒకే నేషన్ నినాదం అంటూ కేంద్రం ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చిందని, ఒకే దేశంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. దేవుడిపై భక్తి బీజేపోళ్లకు లేదని, ప్రతిఒక్కరి నామకరణంలోనూ దేవుడు ఉన్నారని తెలిపారు. మాయమాటలు చెప్పి దేవుడిని కేవలం బీజేపీ నేతలు సృష్టించినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం అద్భుతంగా రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కులమతాలకు తావులేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతూ కేంద్రం ఉండాలని, కేంద్రం తన తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ ఊరుకోరని, ఎంత దూరమైనా వెళ్తారని తెలిపారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చెరువుల్లో చేపపిల్లలను విడిచేందుకు రూ.2వేల కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు చేపలు సరఫరా చేసే స్థాయి కి చేరుకోవడం హర్షణీయమన్నారు. తక్కువ సమయంలోనే వరి అత్యధికంగా సాగుచేస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. పెద్ద చెరువు చుట్టూ నెక్లెస్‌రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని, పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో నిరసన కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ సారథ్యంలో కేంద్రంపై కలిసికట్టుగా ఉద్యమం చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్ కొరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, ఏప్రిల్ 4: తెలంగాణలో యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడారు. జాతీయ రహదారిపై బుధవారం చేపట్టనున్న రాస్తారోకోను విజయవంతం చేయాలన్నారు. 7న జిల్లాకేంద్రంలో నిరాహార దీక్షలకు మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, రైతులు పాల్గొనాలని తెలిపారు. 8వ తేదీన ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా కనికరం చూపడంలేదన్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత పోరుకు సిద్దమై ఉండాలని పిలుపునిచ్చారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎంపీపీ బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్, జిల్లా డైరెక్టర్ కొండ లక్ష్మ య్య, ఎంపీటీసీలు వడ్లశేఖర్, చెన్నయ్య, సర్పంచులు వెంకన్న, సుధ, చిన్నచెన్నయ్య, బాలాగౌడ్, నాయకులు నరేందర్, జంబులయ్య, రమణారెడ్డి, శ్రీనివాసులు, సత్యం, సుధాకర్‌రెడ్డి, నాగన్న, ఆనంద్, శివకుమార్, కొండ బాలయ్య, యాదయ్య, శ్రీనివాసులు, బసిరెడి, బాలకిష్టయ్య, కృష్ణార్జున్ పాల్గొన్నారు.