e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home జిల్లాలు Kims hospital | 24 గంటల్లో మూడు జతల ఊపిరితిత్తుల మార్పిడి.. కిమ్స్​‍ వైద్యుల రికార్డు

Kims hospital | 24 గంటల్లో మూడు జతల ఊపిరితిత్తుల మార్పిడి.. కిమ్స్​‍ వైద్యుల రికార్డు

బేగంపేట్‌ : 24 గంటల వ్యవధిలో ముగ్గురు రోగులకు రెండేసి ఊపిరి తిత్తులను విజయవంతంగా మార్చారు సికింద్రా బాద్‌ కిమ్స్​‍ వైద్యులు. ఇలాంటి ఘటన ఆసియాలోనే మొట్టమొదటి సారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో పితామహుడిగా భావించే డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్సలు జరిగాయి.24 గంటల వ్యవధిలోనే ముగ్గురు రోగులకు శస్త్ర చికిత్సలు చేశారు. ఈ ముగ్గురి ఊపిరి తిత్తుల వైఫల్యం తీవ్రస్థాయిలో ఉండటంతో తప్పనిసరిగా ఊపిరి తిత్తులు మార్చాల్సి వచ్చింది.

- Advertisement -


ఊపిరి తిత్తులను ఇలా సేకరించారు..
తొలిజత ఊపిరితిత్తులను హైదరాబాద్‌లో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తినుంచి సేకరించారు. రెండో జత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సేకరించి చార్టర్డ్‌ విమానంలో హైదారబాద్‌కు తీసుకువచ్చారు. ఈ రెండు శస్త్రచికిత్సలు నవంబర్‌ 24 బుధవారం సాయంత్రం చేశారు.

మూడవది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సేకరించి గురువారం ఉదయం విమానమార్గంలో హైదరాబాద్‌ కిమ్స్​‍ ఆసుపత్రికి తీసుకువచ్చి శస్త్ర చికిత్స నిర్వహించారు.ఈ సంధర్భంగా డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ మాట్లాడుతూ…

మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి దాతల నుంచి సేకరించిన ఊపిరి తిత్తులను మొత్తం 12 మంది ప్రత్యేక వైద్య నిపుణులు అనుభవజ్ఞలైన నర్సింగ్‌ సిబ్బంది కలిసి 6 నుంచి 8 గంటల సమయంలోనే రోగులకు అమర్చగలిగామని తెలిపారు. అందరూ పూర్తి స్థాయి సమన్వయంతో కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement