షాబాద్, సెప్టెంబర్ 23 : ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఉమ్మడి జిల్లాతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి ఉమ్మడి రంగారెడ్డిజిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా తన నివాసంలో మొక్క నాటారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, పట్నం నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, మాలతి, గోవిందమ్మ, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, విజయలక్ష్మి, గోవర్దన్‌రెడ్డి, నక్షత్రం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోన్న స్వప్న, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు నర్సింగ్‌రావు, ప్రభాకర్, మహేందర్‌రెడ్డి, గోపా ల్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్‌రెడ్డి, మతీన్, శేరిగూడెం వెంకటయ్య, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, రాజేందర్‌గౌడ్, పొన్న నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, జీవన్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకటయ్య, బండ మహేందర్‌గౌడ్, పీసరి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.
శంకర్పల్లి మండల నాయకులు
శంకర్పల్లి, సెప్టెంబర్ 23 : ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శంకర్పల్లి మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గుడిమల్కాపూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, శేరి అనంత్‌రెడ్డి గురువారం మహేందర్‌రెడ్డికి గజమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ రాజునాయక్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిర్జాగూడ సర్పంచ్ రవీందర్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గం నాయకులు…
చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 23 : చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మండల మాజీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, రమేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రమణారెడ్డి, సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, మల్లా రెడ్డి, ఎంపీటీసీ నరేందర్ చారి, భూపతి రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.