ప్రతి బస్తాకూ క్యూఆర్ కోడ్

పక్కాగా శనగల కొనుగోళ్లు
పకడ్బందీగా క్రాప్ బుకింగ్
ఎకరాకు 6.20 క్వింటాళ్లు
దళారులకు చెక్ అన్నదాతల హర్షం
తాంసి, ఏప్రిల్ 4 : జిల్లాలో శనగల కొనుగోళ్లను ప్రభుత్వం పక్కాగా నిర్వహిస్తున్నది. ప్రతి శనగ బస్తాకూ క్యూఆర్‌కోడ్‌ను అధికారులు ట్యాగ్ చేస్తూ, ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్ నమోదు చేస్తున్నారు. దీంతో దళారులు, వ్యాపారులకు చెక్ పెట్టినట్లయింది. మార్కెట్లో రోజుల తరబడి పడిగాపులు కాసే బాధ తప్పిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శనగ పంటను యాసంగిలో ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) ఆన్లైన్ నమోదు చేశారు. ఆ లెక్కల ప్రకారమే ఇప్పడు రైతుల నుంచి శనగలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ప్రతి బ్యాగ్‌ను ఎలాంటి తప్పులు లేకుండా తూకం వేస్తూ బ్యాగ్‌కు క్యూఆర్ కోడ్‌తో ట్యాగ్ చేస్తున్నారు. రైతు మార్కెట్‌కు పంట తెచ్చింది మొదలు లోడ్ చేసే వరకు వారిని భాగస్వాములు చేస్తూ కొనుగోళ్ల సందర్భంగా ఎలాంటి అవకతవకలూ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
పకడ్భందీగా క్రాప్ బుకింగ్…
యాసంగిలో శనగ పంట సాగు విస్తీర్ణం వివరాలను క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఏఈవోలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. రైతుల పేర్లు, విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేయడంతో ఇప్పుడు శనగల కొనుగోళ్లు సులభతరమవుతున్నాయి. రైతుల వివరాలు సంబంధిత గ్రామ పంచాయతీల్లో నోటిస్ బోర్డులపై అందుబాటులో ఉంచారు.
ప్రతి బస్తాకూ క్యూఆర్ కోడ్..
రైతులు పండించిన శనగలు మార్కెట్‌కు తీసుకువచ్చిన తర్వాత వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అనంతరం గన్నీ బ్యాగ్‌ల్లో తూకం వేస్తున్నారు. క్యూఆర్‌కోడ్‌తో కూడిన స్టిక్కర్‌ను బ్యాగుకు అతికిస్తున్నారు. ఈ వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. తూకంలో మొసం జరగకుండా చూస్తున్నారు.
దళారులకు చెక్..
శనగల కొనుగోళ్ల సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న ఈ విధానంతో దళారులకు, వ్యాపారులకు చెక్ పెట్టినట్లయింది. గతంలో పంటల వివరాలు ఆన్లైన్ చేయకపోవడంతో దళారులు, వ్యాపారులు మహారాష్ట్ర, జిల్లాలోని రైతులనుంచి తక్కువ ధరకు శనగలు కొనుగోలు చేసి లక్షల రూపాయలు ఆర్జించేవారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారి ఆటలు సాగడం లేదు. స్థానిక రైతులే మార్కెట్‌కు తెచ్చి వారి పంటను ఎలాంటి అసౌకర్యం లేకుండా క్వింటాల్‌కు రూ.5100 చొప్పున మద్దతు ధర పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రైతన్నలు సంతోషిస్తున్నారు.
ఇవి కూడా చూడండి..
సెక్స్ కోసం నన్ను వేధించారు: సల్మాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ
లవ్ ట్రాక్ గురించి చెప్పిన అంజలి
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

