Osmania hospital | ఉస్మానియా దవాఖానలో పదిమంది హౌస్ సర్జన్లకు కరోనా

సుల్తాన్‌బజార్ : ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న హౌస్ సర్జన్లకు కరోనా పా జిటివ్ నిర్ధారణ అయ్యింది. కొవిడ్ థర్డ్ వేవ్‌లో భాగంగా గత రెండు రోజులుగా హౌస్ సర్జన్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారు కరోనా పరీక్షలు చేయించుకోగా పది మంది హౌస్ సర్జన్లకు పాజిటివ్ అని తేలింది.
విషయం తెలుసుకున్న దవాఖాన పాలకవర్గం వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా ఒకే సారి దవాఖానలో పది మందికి కరోనా సోకడంతో హౌస్ సర్జన్లతో పాటు వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ వచ్చిన హౌస్ సర్జన్లతో కలిసి పని చేసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటు న్నారు. ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతం ఆయిన క్రమంలో దవాఖానాలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్లు, రేడియాలజీ విభాగం సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్ర త్తలను తీసుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ సూచించారు.
వైద్య చికిత్సల నిమిత్తం దవాఖానకు వచ్చే రోగులు, రోగి సహాయకులు ఖఛ్చితంగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించని వారిని గుర్తించి జరిమాన విధిస్తామని అన్నా రు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

