అర్వపల్లి, అక్టోబర్ 10 : ఆలయాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. ఆదివారం కొమ్మాల గ్రామంలో శ్రీవేణుగోపాల స్వామి ఆలయ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు. అర్వపల్లి దేవాలయం పునఃనిర్మాణానికి సైతం కోటి రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. సమైక్యపాలనలో అభివృద్ధ్దికి నోచుకోని యాదాద్రి ఆలయాన్ని అపురూప క్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పాలకవర్గం సభ్యులు ఆలయాభివృద్ధ్దికి కృషి చేయాలని సూచించారు. ఆలయాభివృద్ధ్దికి రూ. 50 వేల విరాళంగా అందజేశారు. అనంతరం కొత్త పాలకవర్గ సభ్యులతో దేవాదాయశాఖ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు గ్రామంలో 16 లక్షలతో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, పీఏసీఎస్ ఛైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, సర్పంచ్ గంగదారి వెంకటమ్మ, ఎంపీటీసీ బిక్కూనాయక్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత..
తుంగతుర్తి : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, బీసీ కమిషన్ సంఘం సభ్యులు కోతి కిశోర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దుర్గామాత మండపం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. బీసీ సంఘం సభ్యుడు కోతి కిశోర్‌గౌడ్ తొలిసారి తుంగతుర్తికి రావడంతో ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు తాటికొండ సీతయ్య, సంయుక్త కార్యదర్శి తునికి సాయిలుగౌడ్, దొంగరి శ్రీను, ఎంపీటీసీ సృజనాపరమేశ్, పులుసు వెంకటనారాయణగౌడ్, శ్రీను, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
నేడు డి.కొత్తపల్లికి ఎమ్మెల్యే కిశోర్ రాక
నాగారం : మండలంలోని డి.కొత్తపల్లి గ్రామానికి సోమవవారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ రానున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గామాత మండపం వద్ద ఎమ్మెల్యే పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.