గరిడేపల్లి, అక్టోబర్ 10 : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీలావెంకటరమణారెడ్డి, సీత్లాతండా సర్పంచ్ గుగులోతు సోనాసైదానాయక్ అన్నారు. ఆదివారం తండాలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు గుగులోతు బాబునాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సంసృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత
పెన్పహాడ్ : కులం, మతం, జాతి, వర్గ విబేధాలకు తావులేకుండా సంస్కృతీ, సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎంపీపీ నెమ్మాది భిక్షం అన్నారు. మండలంలోని చీదెళ్లలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కీర్తి వెంకటరాజు, మాజీ ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆడబిడ్డల ఆనందం కోసమే..
నూతనకల్ : రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరలను పంపిణీ చేస్తున్నారని లింగంపల్లి గ్రామ సర్పంచ్ గోరుగంటి ఉషారామకిషన్ అన్నారు. గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మున్న లక్ష్మి, ఉప సర్పంచ్ మున్న లింగయ్య, పంచాయతీ కార్యదర్శి ఉమేశ్ పాల్గొనారు.