ఘనంగా జయంతి వేడుకలు
సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 6: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య జయశంకర్ సార్ కృషి మరువలేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్‌సార్ పాత్రను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతీశ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, ప్రధాన కార్యదర్శి రాజనరేందర్‌గౌడ్, ఎంపీడీవో ఎం.రాజు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఫోరం కన్వీనర్ దేవేందర్, నాయకుడు శ్రీనివాస్, రూరల్ అధ్యక్షుడు సురేశ్, పశు సంవర్ధక శాఖ ఫోరం రాష్ట్ర కార్యదర్శి జగన్, తెలంగాణ ఎన్జీవోల సంఘం కోశాధికారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ సత్యం, రూరల్ కార్యదర్శి అంజి, అనిత, అజయ్, మల్లేశ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, ఆగస్టు 6: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన కృషిని కొనియాడారు.
పెద్దపల్లి జంక్షన్, ఆగస్టు 6: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. డీపీవో చంద్రమౌళి, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, కలెక్టర్ ఏవో ప్రసాద్, కలెక్టర్ పర్యవేక్షకుడు రవీందర్, ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఎస్ఈ గంగాధర్, వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ శంకర్ నాయక్, వైస్ చైర్మన్ జడల సురేందర్ నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీరింగ్ అసోసియేషన్ కార్యదర్శి రవీందర్, ఏవోలు లక్ష్మయ్య, తిరుపతయ్య, ఏఈలు రాజమల్లు, సురేశ్, ప్రకాశ్, శ్రీనివాస్, మార్కెట్ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, ఇక్బాల్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, వైస్ చైర్ పర్సన్ నజీన్సుల్తాన్ మొబిన్, ఎంపీటీసీ లక్ష్మణ్, కౌన్సిలర్లు ఉప్పు రాజు, శ్రీధర్, పద్మ రవి, పీఏసీఎస్ డైరెక్టర్ రాజ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిటౌన్, ఆగస్టు 6: ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయ ఏవో నాగరాజమ్మ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సీనియర్ అసిస్టెంట్ రవీందర్, డీటీ అనిల్‌కమార్, సిబ్బంది పాల్గొన్నారు. కూనారం రోడ్డులోనూ వేడుకలు నిర్వహించారు.
పెద్దపల్లి కమాన్, ఆగస్టు 6: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జూనియర్ అసిస్టెంట్ ఎండీ గఫార్, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
ఓదెల, ఆగస్టు 6: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి సార్ చిత్ర పటానికి పూలమాల వేశారు. గూడెంలో జడ్పీ డిప్యూటీ సీఈవో గీత పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీ వో వాజిద్, సర్పంచ్ గోవిందుల ఎల్లస్వామి, నాయబ్ తహసీల్దార్ వసంతరావు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 6: మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీవో గోవర్ధన్, ఏవో నాగార్జునతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్, ఆగస్టు 6: మండల వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా ల్లో ఎంపీపీ బాలాజీరావు, విండో చైర్మన్ మోహన్‌రావు, ఎంపీడీవో శశికళ, సర్పంచులు వీరగోని సుజాత, ఏరుకొండ రమేశ్‌గౌడ్, ఎంపీటీసీ పులి అనూష, మానిటరింగ్ అధికారి సురేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జూలపల్లి, ఆగస్టు 6: జూలపల్లి, పెద్దాపూర్, కుమ్మరికుంట గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, సర్పంచులు మేచినేని సంతోష్‌రావు, కంకణాల భారతి, ఎంపీటీసీ తమ్మడవేని మల్లేశం, విండో చైర్మన్లు కొంజర్ల వెంకటయ్య, పుల్లూరి వేణుగోపాల్‌రావు, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో రమేశ్ పాల్గొన్నారు.
ఎలిగేడు, ఆగస్టు 6: మండల వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు గోపు విజయభాస్కర్‌రెడ్డి, అశోక్‌కుమార్, కేశెట్టి విక్రం, సత్యనారాయణ, బూర్ల సింధూజ, తానిపర్తి స్రవంతి, వెంకటేశ్వరరావు, బైరెడ్డి రాంరెడ్డి, మోహన్‌రావు, చంద్రశేఖర్‌యాదవ్, రాజనర్సయ్య, కొండయ్య, కొండాల్‌రెడ్డి, కావేరి, అయిలయ్య, విజేందర్‌రెడ్డి, సౌమ్య, ప్రభావతి, స్వప్న, ఆర్కే రాజా, వెంకటేశ్వరావు, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, ఆగస్టు 6: స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో జాగృతి వ్యవస్థాపక దినోత్సవం, జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంచారు. కార్యాలయ ఆవరణలో జాగృతి జెండాను ఆవిష్కరించారు. జాగృతి నాయకులు అందె సదానందం, ఆవుల రాజేశ్ యాదవ్, తోకల రమేశ్, శ్రీనివాస్, విశ్వవాణి, లక్ష్మణ్, రాజేశ్, కనకరాజ్, సంపత్, శ్రీనివాస్, విజయ్‌కుమార్, భానుప్రసాద్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులున్నారు. గంగానగర్‌లో పట్టణ కమిటీ అధ్యక్షుడు అచ్చ వేణు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తోకల రమేశ్, గుంపుల ఓదెలు, వంగ వీరస్వామి, గంగరాజు, శ్రీనివాస్, చిన్నమూల విజయ్, నర్సయ్య, భానుప్రసాద్, లక్ష్మణ్, విశాల్, కనకరాజు, సదయ్య, మహేందర్, రమేశ్, నాగేశ్వర్రావు తదితరులున్నారు.
కోల్‌సిటీ, ఆగస్టు 6: నగర పాలక సంస్థ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ మేయర్ నారాయణరావు, సెక్రటరీ రాములు, ఎస్ఈ చిన్నారావు, రెవెన్యూ అధికారి మనోహర్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కమాన్‌పూర్, ఆగస్టు 6: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు నీలం సరిత, కోలేటి చంద్రశేఖర్, ఎండీ.ఇంతియాజ్, బొజ్జ రాజసాగర్, జాబు సతీశ్ తదితరులున్నారు.
రామగిరి, ఆగస్టు 6: సెంటినరీకాలనీలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, నాయకులు శెంకేసి రవీందర్, గౌతం శంకరయ్య, ధర్ముల రాజసంపత్, నాగెల్లి సాంబయ్య, దేవ శ్రీనివాస్, పింగిళి సంపత్‌రెడ్డి, ఉదయ్, రమేశ్, కుమారస్వామి, రాజన్న, మల్లయ్య, రవిశంకర్, కృష్ణ, శ్యాం, మల్లేశ్ తదితరులున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, మండల స్పెషల్ ఆఫీసర్ సాయినాథ్, ఎంపీడీవో విజయకుమార్ పాల్గొన్నారు.
ముత్తారం, ఆగస్టు 6: మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత-అశోక్, మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్తె చంద్రమౌళి, అల్లం తిరుపతి, రవీందర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ సుధాకర్, డీటీ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ మధన్, సిబ్బంది ఉన్నారు.
జ్యోతినగర్(రామగుండం), ఆగస్టు 6: అంత ర్గాం ఎంపీడీవో కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ దుర్గం విజయ, ఎంపీడీవో యాదగిరినాయక్, జడ్పీటీసీ ఆముల నారాయణ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు దివాకర్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, మండల కో ఆప్షన్ మెంబర్ గౌస్‌పాషా, సూపరింటెండెంట్ కరుణాకర్, సిబ్బంది ఉన్నారు. రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఎస్ఈ విజేందర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ధర్మారం/పెద్దపల్లి కమాన్, ఆగస్టు 6: ధర్మారం మండల వ్యాప్తంగా జయశంకర్ జయంతిని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు జయశీల, ముత్యాల బలరాంరెడ్డి, పెంచాల రాజేశం, తార కొండయ్య, సాయికుమార్, కొమురయ్య, గుర్రం మోహన్‌రెడ్డి, కనకయ్య, స్వరూపారాణి, పెద్దులు, బుచ్చిరెడ్డి, రాజయ్య, వెంకటేశం, తిరుపతిగౌడ్, వెంకటస్వామి, ఎల్లయ్య, రమేశ్, ఠాకూర్ హన్మాన్‌సింగ్, గట్టుస్వామి, శ్రీనివాస్, రాజయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంథని టౌన్, ఆగస్టు 6: మంథనిలోని జడ్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్, ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, నాయకులు ఆకుల కిరణ్, గర్రెపల్లి సత్యనారాయణ, రవి, పద్మ, లింగయ్య పాల్గొన్నారు. మంథని పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వైస్ చైర్మన్ బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, డైరెక్టర్లు కిషన్‌రెడ్డి, శ్రీనివాస్, విజయ్‌కుమార్ తదితరులున్నారు.