హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే అధిక సంఖ్యలో నిర్మాణం
మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్రతిపక్షాల విమర్శలకు దీటైన సమాధానం
జగిత్యాల, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): జగిత్యాల పట్టణ పరిధిలో పెద్ద సంఖ్యలో శరవేగంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లే రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని నిజమాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మండలిలో కాంగ్రెస్ సభ్యుడు టీ జీవన్‌రెడ్డి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై చేసిన విమర్శలను కవిత దీటుగా తిప్పి కొట్టారు.
జగిత్యాల పట్టణ పరిధిలో పెద్ద సంఖ్యలో శరవేగంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లే రాష్ట్ర ప్ర భుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మండలిలో కాంగ్రెస్ సభ్యుడు టీ జీవన్‌రెడ్డి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై చేసిన విమర్శలను కవిత దీటు గా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించడం లేదని ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొనడం సరికాదన్నారు. హైదరాబాద్ తర్వాత జగిత్యాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క నిధులతో 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసిందన్నారు. గత జనవరి నుంచి అక్టోబర్ వరకు జగిత్యాలలోని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామన్నా రు. వీటిపై గృహ నిర్మాణ శాఖ మంత్రితో చర్చించామని చెప్పారు. తొమ్మిది నెలల్లోనే ఇండ్ల నిర్మాణానికి రూ. 73 కోట్లకు పైగా జరిపిన చెల్లింపులే ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు.