కోదాడ, నవంబర్ 1 : పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 275మంది లబ్ధిదారులకు రూ. 90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్థ్ధిక సాయం మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, ఎంపీపీలు చింతా కవితారెడ్డి, యాతాకుల జ్యోతీమధుబాబు, చుండూరు వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ ఉమాశ్రీనివాస్, పుల్లారావు, బాణాల కవితానాగరాజు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి రమేశ్, పల్లా నర్సిరెడ్డి, తొగరు రమేశ్, శీలం సైదులు, అనంత సైదయ్య, దొడ్డ సురేశ్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
క్రీడారంగ అభివృద్ధికి ప్రాధాన్యం
మునగాల : క్రీడారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాలలో భోజనశాల ఏర్పాటు చేయాలని, ఎంపీడీఓ కార్యాలయం నుంచి పాఠశాల వరకు సీసీరోడ్డు నిర్మించాలని ప్రిన్సిపాల్ సాయిఈశ్వరి ఆయనకు వినతిపత్రం అందజేశారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ సుంకర అజయ్‌కుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వీరంరెడ్డి లింగారెడ్డి, సర్పంచ్ చింతకాయల ఉపేందర్, ఉప సర్పంచ్ వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్, మాజీ జడ్పీటీసీ కోల ఉపేందర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు ఉడుం కృష్ణ, శ్రీను, ఎలక కవిత పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వాలి
అనంతగిరి : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు చేయూతనివ్వాలని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ కోరారు. కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాయిలసింగారానికి చెందిన గద్దె రఘు స్థానిక ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎల్ఈడీ టీవీలను హెచ్ఎంలకు అందించారు. ఎంపీపీ వెంకటేశ్వర్లు, ఎంఈఓ సలీం షరీఫ్, హెచ్ఎం బావాసింగ్, శేఖర్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.