పల్లె, పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలి
ప్రగతిలో ముందుండే పల్లెలకు పారితోషికం
పెండింగ్ పనులు పూర్తి చేయండి
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
జనగామ సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
జనగామ, జూన్ 30(నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అధికా రులు, ప్రజాప్రతినిధులు సమష్టి బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ సమీపంలోని ఎస్ఆర్ గార్డెన్లో జనగా మ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టీ రాజయ్యతో కలిసి పల్లె, పట్టణ ప్రగతి, హరితహా రం కార్యక్రమాల కార్యాచరణపై జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతిని ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకొని విజయవంతం చేసి జనగామ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపాలని అన్నారు. గ్రామా భివృద్ధిలో నిర్లక్ష్యం చేసే సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రగతి సాధించిన మొదటి ఐదు గ్రామాలకు పారితోషికంగా అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, ప్రతి గ్రామం లో పటిష్టమైన కార్యాచరణ రూపొందించడానికి కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులను సమ న్వయం చేసుకోవాలని సూచించారు.
ఇందుకోసం గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుడు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ లైన్‌మన్, మిషన్ భగీరథ టెక్నికల్ అసిస్టెంట్‌తో ఒక కమిటీని ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. వార్డు ల వారీగా ప్రణాళికను ఖరా రు చేసేందుకు తొలుత గ్రామ సభ నిర్వహించి ప్రగతి నివేది క కాపీలు పంపిణీ చేయాల ని, దాతలను ప్రోత్సహించి వారి పేర్లు గ్రామ నోటీస్ బో ర్డులో పెట్టాలన్నారు. సీనియ ర్ సిటిజన్లు, రిటైర్డు ఉద్యోగు ల సేవలను వినియోగించు కోవాలని, యువకులు, మ హిళలు కార్యక్రమాల్లో భాగ స్వాములయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ ప్రణాళికలు, అందరి కృషితో సీజనల్ వ్యాధులు ప్రబలని రాష్ట్రంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి రశీదు తీసుకొని రిజిస్టర్‌ను పంచాయతీ కార్యదర్శి నిర్వహించాలన్నారు. ప్ర ధాన రహదారులు, అంతర్గత రోడ్లు, సంస్థలు, బహిరంగ ప్రదేశాలు, లేఅవుట్లలో వందశాతం ప్లాంటేషన్ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతిలో ఒకరోజు పవర్ డేగా పాటించి వంగిన, విరిగిన, తుప్పు పట్టిన పోల్స్‌ను గుర్తించి కొత్తవి పెట్టించాలని, తీగలు ఇండ్ల మీదకు రాకుండా చూడా లన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అదనపు కలెక్ట ర్లు రోజు వారీ పర్యటనలు, తనిఖీలు చేయాలని, కార్య దర్శి పురోగతి నివేదికను ఈ-పంచాయతీ వెబ్సైట్లో అప్ లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ కే నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, జడ్పీటీసీలు, ఎం పీపీ లు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.