ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎందుకంత ప్రాధాన్యం.. దాన్ని లక్ష్మీదేవి స్వరూపమని ఎందుకంటారు?
Neem | ఆయుర్వేద గుణాల్లో చెట్టంత ఔషధం వేప. ప్రాణవాయువును అందించడంలో కల్పతరువు నింబవృక్షం. ఆధ్యాత్మిక సాధనలో, సౌందర్య పోషణలో.. వేప ప్రాధాన్యం పచ్చగా కనిపిస్తుంది. లక్ష్మీవృక్షంగా పేరున్న వేప చెట్టు నిన్నమొన్నటి వరకు తెగులు పట్టి మొండి కొమ్మలతో దీనంగా కనిపించింది. ఇప్పుడు, తనకు పట్టిన చీడను తానే వదిలించుకొని ఉగాది వేళకు మళ్లీ జీవం పోసుకుంది. పచ్చని ఆకులతో, నిండైన పూతతో, మెండైన ఔషధ గుణాలతో ఉగాది పచ్చడికి నిఖార్సయిన చేదును అందిస్తున్నది.
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. కాలచక్రంలో ఆరు రుతువులకు, మానవ జీవితంలో అన్ని రకాల అనుభవాలకూ ప్రతీక ఉగాది పచ్చడి. చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు రుచులతో ఉగాది పచ్చడి నోరూరిస్తుంటుంది. వేపపువ్వు, కొత్తబెల్లం, ఉప్పు, చింతపండు, లేతపచ్చి మిరపకాయ (మిరియాలు మరింత శ్రేష్ఠం), లేత మామిడి ముక్కలు కలిపి చేసిన ఈ ఉగాది ప్రసాదం స్వీకరించటాన్ని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునేందుకు అనువుగా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంపొందటానికి ఉగాది పచ్చడి దోహదం చేస్తుంది.
యద్వర్షాదౌ నింబ సుమం శర్కరామ్ల ఘృతైర్యుతం
భక్షితం పూర్వమాయే స్యాత్ త ద్వర్షం సౌఖ్యదాయకం
..అని శాస్త్ర వచనం. ఆరు రుచుల ఉగాది పచ్చడి తినడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని పెద్దల మాట. ఇందులో ‘నింబ కుసుమం’ అంటే వేప పువ్వు. ఔషధం చేదుగానే ఉంటుంది. కానీ, దాని ప్రభావంతోనే వ్యాధులు నయమవుతాయి. ఉగాది పచ్చడి తీసుకుంటూ ‘శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం’ అని చెబుతారు. ఇందులోనూ వేప ప్రాధాన్యం కనిపిస్తుంది. ఒకరకంగా వేపపువ్వు తినడానికే ఉగాది పచ్చడిని సృష్టించారేమో అనిపిస్తుంది.

వేపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. దీని వెనుక ఒక పురాణగాథ కనిపిస్తుంది. ఒకసారి పార్వతీపరమేశ్వరులు కైలాసంలో ఏకాంతంగా ఉన్నారట. అప్పుడు అటుగా వచ్చిన అగ్నిదేవుడిని చూసి పార్వతి అగ్గిమీద గుగ్గిలం అయిందట. ‘మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే, వారంతా భూమి మీద వృక్షాలుగా మారిపోదురు గాక’ అని శపించిందట. అలా దేవతలంతా వివిధ వృక్షాల రూపంలో భూమి మీద స్థిరపడ్డారు. ఈ క్రమంలో లక్ష్మీదేవి వేపగా అవతరించిందట. పురాణ కథ ఎలా ఉన్నా, వేప నిజంగా లక్ష్మీదేవే! వేప చిగురు మొదలు వేర్ల వరకు ఉపయోగం లేనిదంటూ లేదు. వేర్లు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూత, గింజ, కాయ, పండు, బెరడు అన్నిట్లో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి. వేప నూనె కీళ్లు, కండరాల పటుత్వానికి దోహదం చేస్తుంది. వేప పుల్ల దంతరక్షణకు శ్రేయస్కరం. వేప పువ్వు జీర్ణ కోశ వ్యాధులను నివారిస్తుంది. వేప గుజ్జు వ్యవసాయక్షేత్రంలో క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతుంది. ఒక్క వేప చెట్టు రోజుకు సుమారు 250 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మనిషి మనుగడకు ఇంతలా ఉపయుక్తమవుతున్న వేప చెట్టు ముమ్మాటికీ మహాలక్ష్మే. వేపకు నింబవృక్షంతోపాటు అరిష్ట, క్రిమిఘ్న, పించు మర్దనం అనే పేర్లున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడటంలో సూర్యభగవానుడితో సమానమైన శక్తి ఉంది కాబట్టి, వేపను ‘రవి సన్నిభ’ అని పిలుస్తారు.
Read More :
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotional
- Neem tree
- Ugadi
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

