Goddess Lakshmi | దీపావళి పర్వదినాన లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు..?
Goddess Lakshmi | చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణించాలనే సందేశాన్నిచ్చే పండగే దీపావళి. దీపావళి... అంటేనే దీపాల వరుస... నరకాసుర సంహారానికి సంకేతంగా అమావాస్య చీకట్లను పారదోలుతూ జరుపుకునే వెలుగుల పండుగ.
Goddess Lakshmi | చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణించాలనే సందేశాన్నిచ్చే పండగే దీపావళి. దీపావళి… అంటేనే దీపాల వరుస… నరకాసుర సంహారానికి సంకేతంగా అమావాస్య చీకట్లను పారదోలుతూ జరుపుకునే వెలుగుల పండుగ. ఈ రోజున ప్రతి ఇంటా దీపాల్ని విధిగా వెలిగిస్తారు. ఈ పండుగ రోజున దీపాలను వెలిగించి సిరిసంపదలు కోరుతూ లక్ష్మీదేవిని (Goddess Lakshmi) కొలుస్తారు.
పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని అతిథిగా స్వర్గానికి వెళ్తాడు. ఆ ఆతిథ్యానికి మెచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని దేవేంద్రునికి కానుకగా ఇస్తాడు. కానీ, ఇంద్రుడు తిరస్కార భావంతో ఆ హారాన్ని తన ఏనుగు ఐరావతం మెడలో వేస్తాడు. హారం మహిమ తెలియని ఐరావతం.. దాన్ని కిందపడేసి కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహంతో దేవేంద్రుణ్ని శపిస్తాడు. దాంతో ఇంద్రుడు స్వర్గంతోపాటు అన్ని సంపదలనూ పోగొట్టుకుంటాడు. దిక్కుతోచని స్థితిలో విష్ణుమూర్తిని ఆశ్రయిస్తాడు. ఇంద్రుని పరిస్థితిని గమనించిన విష్ణువు.. “ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీమహాలక్ష్మి స్వరూపంగా పూజించు!” అని సూచిస్తాడు. దేవేంద్రుడు అలాగే చేస్తాడు. ఆ పూజతో సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించడంతో.. దేవేంద్రుడు తిరిగి స్వర్గాన్ని, పోగొట్టుకున్న సంపదలనూ పొందుతాడు.
అప్పుడే లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలుపుతూ.. “తల్లీ! నువ్వు కేవలం శ్రీమహావిష్ణువు దగ్గరే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?” అని అడుగుతాడు. దానికి సమాధానమిస్తూ లక్ష్మీదేవి.. “దేవేంద్రా! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారివారి అభీష్టాలకు అనుగుణంగా.. అంటే మహర్షులకు మోక్షలక్ష్మీగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, నన్ను పూజించే విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరేవారికి ధనలక్ష్మిగా, సమస్త కోరికలను నెరవేర్చే వరలక్ష్మీ దేవిగా ప్రసన్నురాలిని అవుతాను!” అని చెప్పింది. అప్పటినుంచి దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించడం ఆనవాయితీగా వస్తున్నది.
Also Read..
Karwa Chauth | కోడలి కోసం అత్తగారి ప్రత్యేక వంటకం.. కర్వాచౌత్ విశేషాలు..
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

