సంక్రాంతి నిలబెట్టడం అంటే.. ఈ నెలలో నువ్వులు దానం చేయాలంటారు ఎందుకు?
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి ఆ నెలకు పేరు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి నెలరోజుల ముందు మొదలవుతుంది. దక్షిణాయనంలో ధనుర్మాసం చివరిది. ఈ కాలంలో సూర్యుడి ప్రభావం భూమిపై చాలా తక్కువగా ఉంటుంది.
- ధర్మసందేహం
ధనుర్మాసంలో సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏమిటి?
ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
– విజయ, కామారెడ్డి
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి ఆ నెలకు పేరు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి నెలరోజుల ముందు మొదలవుతుంది. దక్షిణాయనంలో ధనుర్మాసం చివరిది. ఈ కాలంలో సూర్యుడి ప్రభావం భూమిపై చాలా తక్కువగా ఉంటుంది. చలి తీవ్రత అధికం అవుతుంది. ఆరోగ్యకారకమైన సూర్యరశ్మి పరిమితంగా లభించే సమయం ఇది. ఫలితంగా అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతి (సూర్యుడు మకరంలోకి సంక్రమించే పర్వం) వరకు చలితీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మన పెద్దలు హెచ్చరించారు. దీన్నే సంక్రాంతి నిలబెట్టడంగా పేర్కొన్నారు. అంతేకాదు ధనుర్మాసంతో చాంద్రమానం అంతర్గతంగా వచ్చే పుష్యమాసం ముడిపడి ఉంటుంది.
పుష్యమి నక్షత్రానికి అధిపతి శనైశ్చరుడు కావడంతో ఈ నెలను శూన్యమాసంగా పరిగణిస్తారు. ఇలా శని ప్రభావం అధికంగా ఉండటం, సంక్రాంతిని నిలబెట్టిన నెల రోజులను పీడ దినాలుగా భావించడంతో ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. ఇక శనైశ్చరుడి అనుగ్రహం కోరుతూ ఈ నెలలో నువ్వులు దానం చేయాలని సూచించారు పెద్దలు. ఇలా దానం ఇవ్వమని చెప్పడంలోనూ గొప్ప ఆంతర్యం కనిపిస్తుంది. చలి అధికంగా ఉండే ఈ సమయంలో నువ్వులూ, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి పుట్టి, చలి నుంచి రక్షణ కలుగుతుంది. నువ్వులు కొనలేని బీదసాదలకు వాటిని దానం ఇవ్వడం అంటే.. వారికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చినవాళ్లం అవుతాం! నువ్వులతోపాటు దుస్తులు దానం ఇవ్వడం కూడా చలి నుంచి వారికి రక్షణ కల్పించడానికే!!
…?వంశీధర్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

