ప్రేమకు ఆయుష్షు పోసి.. అసలైన ప్రేమ కథ ఇది
Valentine Day Special | భృగు మహర్షి మనవడు రురువు. గొప్పగా తపస్సు చేసి భృగువంశానికి వన్నె తెచ్చాడు. ఒకసారి స్థూలకేశుడి ఆశ్రమంలో ప్రమద్వర అనే యువతిని చూసి రురువు ఇష్టపడతాడు. ఆమెను పెండ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ప్రమద్వర మేనక-విశ్వావసు అనే గంధర్వుడి కూతురు. ప్రమద్వర పుట్టగానే చంటిపిల్లను స్థూలకేశుడి ఆశ్రమంలో విడిచిపెడతారు. స్థూలకేశుడు ఆ చిన్నారిని అల్లారుముద్దుగా పెంచి పెద్దచేస్తాడు. ఆ ముని ఆశ్రమానికి వచ్చిన రురువు ప్రమద్వర అందానికి విచలితుడై ఆమెను ప్రేమిస్తాడు. ప్రమద్వరను పెండ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని స్థూలకేశుడిని కోరుతాడు. ఆయన కూడా సంతోషంగా అంగీకరించి వివాహానికి శుభ ముహూర్తం నిర్ణయిస్తాడు.
ఇంతలో ఒక రోజు ప్రమద్వర పాము కాటుకు గురై మరణిస్తుంది. విషయం తెలిసిన రురువు పిచ్చివాడిలా అడవులు పట్టుకొని తిరుగుతుంటాడు. ‘నేను పుణ్యకార్యాలు చేసిన వాడినే అయితే, సజ్జనుడినే అయితే, తల్లిదండ్రులను, గురువులను పూజించేవాడినే అయితే, ప్రమద్వరను మనసారా ప్రేమించింది నిజమే అయితే.. ఆమె పునరుజ్జీవితురాలు అవుతుంది’ అని ఆక్రోశిస్తాడు. అప్పుడు ఆ తపశ్శాలితో యమధర్మరాజు ‘రురు మహర్షీ! ప్రియురాలి కోసం దుఃఖించింది చాలు. ప్రమద్వర తిరిగి బతకాలంటే నీ ఆయుష్షులో సగం ఆమెకు ధారపోయాలి. అందుకు సమ్మతమేనా?’ అని అడుగుతాడు. రురువు వెంటనే అంగీకరిస్తాడు. రురువు ఆయుః త్యాగంతో ప్రమద్వర మళ్లీ బతుకుతుంది. వారిద్దరి పెండ్లి కన్నులపండువగా జరుగుతుంది. ప్రేమించిన వారికోసం ఆయుష్షును ధారపోసిన రురువు నిజమైన ప్రేమకు నిదర్శనం.
Read More :
Valentine Day Special | మీకు మీరే..వాలెంటైన్!
Valentine Day Special | నా హనీ.. ఓ మనీ!
Valentine Day Special | జగమంతా..ప్రేమమయం!
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- love
- valentine day
- zindagi
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

