Tirumala | తిరుమలలో పోటెత్తిన భక్తులు.. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి నిరాకరణ.. భక్తుల ఆందోళన
Tirumala | తిరుమల (Tirumala) కు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి అనుమతి నిరాకరించారు.
తిరుమల : తిరుమల (Tirumala) కు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి అనుమతి నిరాకరించారు. దీంతో భక్తులు టీటీడీ(TTD) తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లో నిలబడగా వారిని దర్శనానికి అనుమతిని నిరాకరించారు. తమకు సాధారణ దర్శనానికి అనుమతి ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.
రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి(Vaikunta Dwara Darsan) ప్రత్యేక టోకెన్లు జారీ చేయడంతో ఆ టోకెన్లు ఉన్న వారికే మాత్రమే శుక్రవారం సాయంత్రం నుంచి అనుమతిస్తామని స్పష్టం చేశారు. టీటీడీ శనివారం అర్ధరాత్రి 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలను తెరువనున్నారు. వైకుంఠ ద్వారా దర్శనానికి ఇప్పటికే తిరుమలలో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
కాగా నిన్న 59,868 మంది భక్తులు స్వామివారిని దర్శంచుకోగా 23,935 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.91 కోట్లు వచ్చిందని వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

