Shodasha Panchaka Yogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం షోడశ పంచక యోగం అరుదైన, ప్రత్యేకమైన యోగం. సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తుంటారు. సూర్యుడు కర్కాటకంలో ఉండగా.. యురేనస్తో కలిశాడు. దాంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడింది. ఆగస్టు 13 రాత్రి 11.17 గంటలకు యురేనస్, సూర్యుడు అరుదైన షోడశ పంచక యోగాన్ని ఏర్పరిచారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానున్నది. ఈ యోగాన్ని బినోవిల్ సంయోగంగానూ పేర్కొంటారు. ఇది అత్యంత శుభయోగాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఈ యోగం ప్రభావంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. సంపద, గౌరవాన్ని పొందే అవకాశాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మూడురాశుల వారికి ఈ యోగం కలిసి వస్తుందని పేర్కొంటారు.
వృషభ రాశి వారికి షోడశ పంచక యోగంతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఈ సమయంలో మీ జీవితంలోని అనేక రంగాలలో విజయం సాధించడంతో పాటు పురోగతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలో కొనసాగుతున్న సమస్యలు ముగిసిపోతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు మీ ప్రయత్నాల్లో సానుకూలత ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు సైతం శుభవార్తలు వినే అవకాశాలుంటాయి. వ్యాపారం, వృత్తిలో పోటీదారులపై ఆధిపత్యం సాధిస్తారు.
కన్యా రాశి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ అరుదైన యోగంతో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాల నుంచి మీకు మంచి అవకాశం ఉంది. విదేశాల్లో పని చేయాలనుకునే వారి కల నెరవేరే ఛాన్స్ ఉంది. పదవి, ప్రతిష్ట పెరుగడంతో పాటు జీతం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ తండ్రి, లేదంటే గురువు నుంచి మద్దతు లభిస్తుంది. దాంతో మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి.
వృశ్చిక రాశి వారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. సంపద, ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో మీ సృజనాత్మకత కూడా పెరుగుతుంది. ఇది కెరీర్లో మరిన్ని అవకాశాలను తీసుకువస్తుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఆధ్యాత్మిక పర్యటన చేసే అవకాశాలున్నాయి. ప్రయోషన్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.