Shani Gochar | జ్యోతిషశాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది శని భయపడుతుంటారు. న్యాయానికి అధిపతిగా భావిస్తుండగా.. శని కర్మ ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ప్రతి వ్యక్తికి తాను చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. శనైశ్చరుడి అనుగ్రహం ఉంటే.. వ్యక్తికి కష్టపడే తత్వం, నిబద్ధతత, ఓర్పు తదితర లక్షణాలు అలవడుతాయి. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదడంతో పాటు సమాజంలోనూ గౌరవం పొందుతారు.
ఇక శని దోషాలు ఉంటే మాత్రం ఇబ్బందులపాలయ్యే అవకాశం ఉంటుంది, ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబంలో కలహాలు, ఉద్యోగంలో ఒత్తిడి తదితర ఇబ్బందులు తప్పవు. అయితే, గ్రహాలు ఒక రాశిని వీడి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. ఈ నెల 29న శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక అదేరోజున సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. దాదాపు వందేళ్ల తర్వాత ఇలా జరుగుతుండడం విశేషం.
దీని కారణంగా పలు రాశుల వారికి శుభాలు కలుగుతాయని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శనిగ్రహ సంచారంతో మీనరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలుంటాయని చెబుతున్నారు. మీనరాశిలోకి శనిగ్రహం ప్రవేశించడం.. అదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడడంతో మంచి ఫలితాలుంటాయని తెలుపుతున్నారు. ధనవంతులయ్యే అవకాశం ఉండడంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు లభించే సూచనలున్నాయని చెబుతున్నారు.
అదే సమయంలో ఆ రాశి వారు చేపట్టే ఏ పనిలోనైనా విజయం చేకూరుతుందంటున్నారు. ఇక శనిగ్రహం సంచారంతో తుల రాశి వారికి సైతం శుభ ఫలితాలుంటాయని పేర్కొంటున్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయని.. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే విశేష ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు. అలాగే, ధనస్సు రాశి వారికి సైతం సూర్యగ్రహంతో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అప్పుల బాధల నుంచి విముక్తులవుతారని.. సంతానం లేని వారికి.. పిల్లలు కలిగే సూచనలున్నాయని జ్యోతిష పండితులు తెలుపుతున్నారు. మిథున రాశి వారికి సైతం సూర్యగ్రహణంతో కొంత వరకు శుభాలుంటాయని.. శని సంచారంతో మరింత లాభం ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ఊహించలేని విధంగా ప్రయోజనాలుంటాయని.. చాలాకాలంగా ఉండే సమస్యల నుంచి విముక్తులయ్యే అవకాశాలున్నాయని జ్యోతిష పండితులు వివరిస్తున్నారు.