Rath Saptami | 25న తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ఆర్జిత సేవలు రద్దు
Rath Saptami | సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి.
తిరుమల : సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి ( Rath Saptami ) వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మలయప్ప స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారని టీటీడీ ( TTD ) అధికారులు తెలిపారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోందని వివరించారు.
వాహనసేవల వివరాలు
స్వామివారు తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం ఉంటుందని వివరించారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసి సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తామని వెల్లడించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

