Vinayaka Temples | వినాయక చవితి భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. విజ్ఞానం, విజయం, శుభఫలితాలకు సంకేతంగా భావించే విఘ్నేశ్వరుడికి పండుగ రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. విజ్ఞానాలను తొలగించే దేవుడిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ క్రమంలో పలువురు భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించాలని భావిస్తుంటారు. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారత్లోని పలు ప్రముఖ విఘ్నేశ్వరుడి ఆలయాలు ఎక్కడున్నాయి? వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి..!
గణేశుడి ఆలయం అనేగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ముంబయిలోని సిద్ధి వినాయకుడి మందిరం. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకునే ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా అత్యధికంగా భక్తులు సందర్శించి వినాయకుడి ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి రాజకీయ నేతలు, సినీతారలు, బడా పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్య భక్తుల వరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయంలోని వరసిద్ధి వినాయకుడి ఆలయానికి విశిష్టత ఉన్నది. ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిశారు. ఆలయంలో స్వామివారు గర్భగుడిలో నడుము లోతు నీటిలో విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆలయంలో భక్తులు సత్య ప్రమాణం చేస్తుంటారు. ఇక్కడ తప్పుడు ప్రమాణం చేస్తే ఆ స్వామివారు శిక్షిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి దక్షిణ భారత్ నుంచే కాకుండా ఉత్తరాధి నుంచి దర్శనం కోసం వస్తుంటారు.
పూణే నగరంలోని ఈ ఆలయం భక్తి, సేవా కార్యక్రమాలకు కేంద్రమైన ఒక ప్రముఖ స్థలం. ఆహ్లాదకరమైన ఆలయ వాతావరణం, వైభవంగా అలంకరించబడిన గణపతి విగ్రహం భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంది. వినాయక చవితి సమయంలో ఇక్కడ పూజలు మహా వైభవంగా జరుగుతాయి.
శివగంగై జిల్లాలోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రాచీన గణపతి ఆలయాల్లో ఒకటి. ఇక్కడ గణపతి విగ్రహం ఒకే శిలపై చెక్కబడిన భారీ విగ్రహంగా ఉంది. కర్పాగ వినాయకర్ అంటే కోరికల్ని తీర్చే గణేశుడు అని అర్థం. ఇక్కడ వివాహాలు, విద్యారంభం వంటి శుభకార్యాలకు ముందు భక్తులు తప్పనిసరిగా దర్శనానికి వస్తారు.
ప్రాచీన విజయనగర సామ్రాజ్యానికి రాజధాని అయిన హంపిలోఉన్న గణేశ ఆలయం శిల్పకళకు అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది. ససివేనగణపతి, కడలేకలు గణపతి వంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నవి. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం, చరిత్ర, ఆధ్యాత్మికత కలయికగా నిలుస్తుంది.
మైసూరులోని పరకాల మఠంలో ఉన్న ఈ ఆలయం, విద్వాంసుల ఆరాధనా క్షేత్రంగా నిలిచింది. గణపతి స్వరూపం, ఆలయ నిర్మాణ శైలి, నిత్య పూజా విధానాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.
యునెస్కో వారసత్వ ప్రదేశమైన ఖజురాహోలోని గణేశుడి ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. అనేక దేవాలయాల మధ్య గణపతికి అంకితమైన ఈ ఆలయం, పురాతన భారతీయ శిల్పకళలో గణపతి స్థానం ఎంత గొప్పదో తెలియజేస్తుంది.
పుదుచ్చేరిలోని ఈ గణపతి ఆలయం, దక్షిణ భారతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఒకటి. ఆలయ గోపురం, గణపతి విగ్రహం భక్తులను ఆకర్షిస్తాయి. ఇది ఫ్రెంచ్ పాలన సమయంలో కూడా కొనసాగిన అరుదైన ఆలయాల్లో ఒకటి.
వినాయక చవితికి సంబంధించి ముంబయి నగరంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన గణపతి లాల్ బాగ్ చా రాజా. ఇక్కడ ప్రతిష్ఠించే గణపతి విగ్రహం ఎంతో ఎత్తుగా ఉంటుంది. లక్షలాది మంది తరలివచ్చి దర్శించుకుంటారు. కోరికల నెరవేర్చే గణపతికి ప్రత్యేక స్థానం ఉంది.