ప్రేమించి చూడు
‘నీవలె నీ సాటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో పక్కవారినీ చూడాలి అనేది చాలా తేలికపాటి మాట.
‘నీవలె నీ సాటి మనిషిని ప్రేమించాలి’ అంటాడు ప్రభువు. మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోగలమో, అంతే ప్రేమతో పక్కవారినీ చూడాలి అనేది చాలా తేలికపాటి మాట. ఆచరణలో చాలా కష్టం. అయితే ప్రేమ ఒకటే దాన్ని తు.చ. తప్పక నెరవేరేలా చేయగలదు. ప్రేమ ఉంటే సాధ్యం కానిది ఏముంది? దైవాన్ని కొలిచే ప్రేమతోనే మనిషినీ చూడాలి. మనిషిలో దేవుణ్ని చూసినప్పుడు, ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడని నమ్మినప్పుడు, అదే దేవుడు నీలో నాలో అందరిలోనూ ఉన్నాడనీ విశ్వసించినప్పుడు.. తోటి మనిషి ఓ శత్రువుగా ఎందుకు కనిపిస్తాడు? అందరిలోనూ ప్రేమమయుడైన దేవుడు ఉన్నాడన్న భావన కలిగితే, ఒకరు.. మరొకరిని ద్వేషించలేరు, హింసించలేరు.
ఒకడు మరొకణ్ని దోపిడీ చేయలేడు. అత్యాచారాలు, అకృత్యాలకు తావుండదు. సర్పాన్ని చూసి మనం భయపడతాం. వాస్తవానికి మనిషి అలికిడి తగలగానే సర్పమే పక్కకు జరిగిపోతుంది. అంతేగాని కనిపించిన మనిషిని కాటువేయదు. కారణం మనం అంటే దానికి భయమే. అక్కడ ఒక జంతువు, ఒక మనిషి. ఇక్కడ తెలివి తేటలున్న ఒక మనిషి మరో మనిషికి భయపడుతున్నాడు. కేవలం ప్రేమ లేకపోవడమే అందుకు కారణం. అవగాహనా రాహిత్యం, సానుభూతి మృగ్యం కావడమే ఇందుకు కారణాలు. అందుకే ప్రభువు ‘నీ దేవుడ్ని ఆరాధించు, పక్కవాడిని ప్రేమించు, దైవారాధనను ప్రేమలా మార్చేసుకో’ అని బోధించాడు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

