TTD | కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TTD | శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి మార్చి 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
TTD | శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి మార్చి 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ క్రమంలో తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుపతికి చెందిన శ్రీమణి రెండు పరదాలు, రెండు కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. వాటిని బ్రహ్మోత్సవాలు వినియోగించనున్నారు. ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

