లోక పాపాలే కారణం!
క్రీస్తు ఈ భూమ్మీద సుమారు 33 ఏండ్లు జీవించాడు. సాదాసీదా ప్రజలతో కూడా మమేకమయ్యాడు. చైతన్యం కలిగేలా బోధనలు చేశాడు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాడు. అయినా కొందరికి ఇవేవీ నచ్చలేదు. ఆయన చేసిన ఉపకారాలన్నీ విషమించి విషంలా కనిపించింది కాబోలు! ప్రభువు మరణానికి కారకులయ్యారు.
- క్రీస్తు సందేశం
క్రీస్తు ఈ భూమ్మీద సుమారు 33 ఏండ్లు జీవించాడు. సాదాసీదా ప్రజలతో కూడా మమేకమయ్యాడు. చైతన్యం కలిగేలా బోధనలు చేశాడు. ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాడు. అయినా కొందరికి ఇవేవీ నచ్చలేదు. ఆయన చేసిన ఉపకారాలన్నీ విషమించి విషంలా కనిపించింది కాబోలు! ప్రభువు మరణానికి కారకులయ్యారు. క్రీస్తు మరణానికి లోక పాపాలే కారణమని తాత్వికులు చెబుతారు. క్రీస్తు మరణానికి తండ్రి ఆనతే కారణమని బైబిల్ గ్రంథం చెబుతుంది. క్రీస్తు మరణానికి తన శిష్యుడు, ఇస్కరియోతే కారకుడని నూతన నిబంధన సాక్ష్యం పలుకుతుంది. యూదులూ, పరిసయ్యులే కారకులని చెబుతారు. ఇవన్నీ వాస్తవాలే! ముఖ్యంగా యూదులు. క్రీస్తు పట్ల, యూదులెందుకు ద్వేషాగ్ని కురిపించారు?
క్రీస్తు తానే మెస్సియాను అని ప్రకటించుకున్నాడు. అప్పటికే మెస్సియా వస్తాడూ అని యూదులు ఎదురు చూస్తున్నారు. ఆ దేవుని కోసం ఎదురు చూసే ప్రజలు… పురాతన ప్రవక్తలు పెట్టిన కఠిన నియమాలను తూ.చ. తప్పక పాటిస్తూ ఉన్నారు. ఆ యూదుల నియమాల్ని సడలించాడు క్రీస్తు. ఆ రోజుల్లో అక్కడి ప్రజలు పన్ను చెల్లించేవారు. ఆ విధానాన్ని ఖండించాడు ప్రభువు. ఆయన బోధనలన్నీ రోమన్లకు వ్యతిరేకంగా ఉన్నాయనేది వారి భావన. ఈ కారణాలే యూదులు తమ రోమన్ రాజును చేరి, క్రీస్తుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రీస్తును పట్టించారు. కొట్టించారు. మరణ తీర్పుతో కలవరి గిరి వైపు నెట్టించారు.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

