ఈ ప్రపంచంలో వ్యాపారం, సినిమాలు, ఆధ్యాత్మికత, సామాజిక సేవ ఇలా విభిన్న రంగాలలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అరుదైన వ్యక్తులలో శ్రీ వేదాల శ్రీనివాస్ గారు ఒకరు. ైక్లెర్వాయంట్, సినీ నిర్మాత, మర్చంట్ ఎక్స్‌పోర్టర్‌గా ప్రతీ రంగంలోనూ ఆయన చేసే ప్రయాణం, నిస్వార్ధంతో చేసే సమాజ సేవలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.తెలుగు పరిశ్రమ, సినీ వ్యాపార ఎగుమతి రంగంలో ప్రఖ్యాతిని పొందకముందే వేదాల శ్రీనివాస్ గారు ప్రముఖ ైక్లెర్వాయంట్గా ఎదిగారు.
ైక్లెర్వాయంట్ గా వేదాల శ్రీనివాస్ ప్రయాణం:
ైక్లెర్వాయన్స్ అనేది ఒక ప్రత్యేక నైపుణ్యం లేదా సహజ ప్రతిభ. ఈ నైపుణ్యం కలిగిన వారిని ైక్లెర్వాయంట్ అని పిలుస్తారు. వీరు భవిష్యత్తులో జరగబోయే, సుదూర ప్రదేశాలలో ప్రస్తుతం జరుగుతున్న/జరిగిన విషయాలను గ్రహించగలరు. ఒక వ్యక్తి లేదా వ్యక్తులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి గురించి జరిగిన, జరగబోయేవి చూడగలరు. ఈ నైపుణ్యం కలిగినవారు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు. ఇది కళ్లతో కాక, మనస్సుతో చూసే శక్తి. ఈనైపుణ్యం కొందరికి సహజంగా వస్తుంది. మరికొంతమంది దీన్ని సాధన ద్వారా నేర్చుకుంటారు.
సహజ ప్రతిభ..
వేదాల శ్రీనివాస్ గారికి ఉన్న ైక్లెర్వాయన్స్ నైపుణ్యం నేర్చుకున్నది కాదు. ఒక సహజ ప్రతిభ – ఆయన కాలక్రమేణా, లోతైన ఆధ్యాత్మిక దృష్టితో క్రమశిక్షణ, ఇతరులకు సహాయం చేయాలనే ఆకాంక్షతో ైక్లెర్వాయన్స్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. శ్రీ వేదాల శ్రీనివాస్ గారు తనకున్న ఈ ైైక్లెర్వాయన్స్ సామర్ధ్యంతో ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి వారి వ్యక్తిగత, ఆర్థిక, వృత్తిపరమైన విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడ్డారు.
ఈ ైైక్లెర్వాయన్స్ జ్ఞానం ఆయనకు.. తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ైక్లెర్వాయన్స్ ప్రయాణం తొలి దశలో శ్రీ వేదాల శ్రీనివాస్ గారికి ఈ ప్రత్యేక సామర్ధ్యం అనేక గుర్తింపులను తెచ్చిపెట్టింది. ఆయనను మొదట ‘ఉత్తమ ైక్లెర్వాయంట్ ‘ అవార్డును జ్ఞానపీఠ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి నుంచి అందుకున్నారు. తర్వాత ఆయనను డాక్టర్ పీవి రంగారావు గారు (మాజీ ప్రధాన మంత్రి పీవి నరసింహారావు గారి కుమారుడు), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ ధర్మారావు గారు, డాక్టర్, ఎంపీ కే లక్ష్మణ్ వంటి ప్రముఖులు ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’తో సత్కరించారు. హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గాన సభలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో శ్రీ సీఎన్. గోపీనాథ్ రెడ్డి గారు నుంచి బల్లెం విశిష్ట పురస్కారం అందుకున్నారు.
ఇన్నర్ విజన్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ..
చాలా మంది నిపుణులు తమ ప్రధాన నైపుణ్యాలకే పరిమితమై ఉన్నప్పటికీ, శ్రీ వేదాల శ్రీనివాస్ గారు ైక్లెర్వాయంట్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి చలనచిత్ర నిర్మాతగా అడుగుపెట్టడానికి ధైర్యం చేశారు. వినోదంతో పాటు అర్థవంతమైన సినిమాలను అందించాలనే మక్కువతో ఆయన శ్రీ మందిరం ప్రొడక్షన్‌ను స్థాపించారు. కన్నడ నటుడు కోమల్ కుమార్, భారత క్రికెటర్ శ్రీశాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన యమధీర ఆయన బ్యానర్లో తొలి చిత్రం. 23 మార్చి 2024న విడుదలై ఈ సినిమా ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్రలో ఘన విజయాన్ని సాధించింది. తర్వాత ఈ చిత్రం 5 ఏప్రిల్, 2024న లో అంతర్జాతీయంగా యు.ఎస్.ఎ (టెక్సాస్) లో విడుదలైంది.శ్రీ మందిరం ప్రొడక్షన్స్ ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తదనం, ప్రేరణ, కమర్షియల్ సక్సెస్ కలిగిన సినిమాలు ఇవ్వడంలో ముందుంటుంది.
శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్:
ైక్లెర్వాయంట్గా, సినీ నిర్మాతగానే కాకుండా, శ్రీ వేదాల శ్రీనివాస్ గారు తాను స్థాపించిన శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్‌తో మర్చంట్ ఎక్స్‌పోర్టర్‌గా కూడా విజయవంతమయ్యారు. శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ అధిక-నాణ్యత గల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులలో ప్రత్యేకత కలిగిన ఎగుమతి వ్యాపార సంస్థ. ఈ సంస్థ నాణ్యతకు కట్టుబడి ఉందని, శ్రేష్ఠతపై నమ్మకం కలిగివుందని, వారికున్న ISO 9001: 2015 సర్టిఫికేషన్ ద్వారా మనకు అర్ధమవుతుంది. శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ అనేక బై-లాటరల్ చాంబర్లు, నేషనల్ లెవల్ చాంబర్లు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లు , కమోడిటీ బోర్డులతో సభ్యత్వం పొందింది.పర్యావరణ బాధ్యతకు మద్దతుగా తక్కువప్రభావం, పునర్వినియోగ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను ఉపయోగించడం ద్వారా, ఈ సంస్థ స్థిరమైన, పర్యావరణ అనుకూల పద్దతులను అనుసరిస్తోంది. శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ ఆధునిక సాఫ్ట్ వేర్లు, డిజిటల్ టూల్స్ వంటి అధునాతన టెక్నాలజీని అనుసరించడం ద్వారా వారి ఎగుమతి కార్యకలాపాలను ఖచ్చితమైన, అత్యాధునికమైనదిగా మలచుకున్నారు.
భక్తి , సామాజిక సేవలు:
ైక్లెర్వాయన్స్ సినీ నిర్మాణం, ఎగుమతి వ్యాపారం కాకుండా శ్రీ వేదాల శ్రీనివాస్ గారు శ్రీ మందిరం టెంపుల్ స్థాపకులు. శ్రీ మందిరం టెంపుల్ ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నం సమీపంలోని చిట్టిగూడూరు గ్రామంలో ఉన్న శ్రీ మావిళ్ళమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ దేవతల పవిత్ర ఆలయాన్ని దశాబ్దం క్రితం తన సొంత నిధులతో నిర్మించారు. గత కొన్ని సంవత్సరాలుగా, శ్రీ వేదాల శ్రీనివాస్ గారు వేసవి కాలంలో మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి (NH-65)లోని తన స్వస్థలమైన చిట్టి గూడూరు వద్ద రెండు ఉచిత చల్లటి త్రాగు నీటి శిబిరాలను నిర్వహిస్తున్నారు.
విజయాలు:
శ్రీ వేదాల శ్రీనివాస్ గారు, CSR సమ్మిట్ 2025లో ప్రతిష్టాత్మకమైన ’బెస్ట్ పార్టనర్షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’ అవార్డుతో సత్కరించబడ్డారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం దక్షిణ భారతదేశంలోని ప్రధాన వేదికగా గుర్తింపు పొందింది CSR సమ్మిట్, వారు సానుకూల సామాజిక మార్పుకు దారితీసే ప్రభావవంతమైన సహకారాలను గుర్తించి ఘనంగా సత్కరిస్తుంటారు. శ్రీ వేదాల శ్రీనివాస్ గారి విద్యా నేపధ్యం గురించి చెప్పాలంటే.. ఆయన ప్రాథమిక విద్యను తన స్వగ్రామంలో పూర్తి చేసి, మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బి.కామ్) డిగ్రీని పొందారు.
తరువాత నిరంతర విద్య పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తూ ఎం.ఎ.లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు, లండన్ విశ్వవిద్యాలయం నుండి ‘గ్లోబల్ డిప్లమసీ-డిప్లొమసీ ఇన్ ది మోడరన్ వరల్డ్ అనే సర్టిఫికేషన్ కోర్సును కూడా పూర్తి చేశారు శ్రీ వేదాల శ్రీనివాస్ గారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ‘ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫైనాన్స్, స్ట్రాటజీ అండ్ సస్టైనబిలిటీ‘ అనే స్పెషలైజేషన్ సర్టిఫికెట్ కోర్సును కూడా పూర్తి చేశారు. ఇటీవలే USA లోని చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి ‘గ్లోబల్ ఇంపాక్ట్: బిజినెస్ ఎథిక్స్” అనే మరో సర్టిఫికేషన్ కోర్సు కూడా విజయవంతంగా పూర్తిచేసారు.
ఆయన స్ఫూర్తి యొక్క మూలం:
శ్రీ వేదాల శ్రీనివాస్ గారు తరచుగా తన తండ్రి శ్రీ వేదాల నరసింహాచార్యులు గారి ద్వారా ఎంతో స్ఫూర్తి పొందానని చెబుతారు. శ్రీ వేదాల నరసింహాచార్యులు గారు సంస్కృత పండితులుగా,చిట్టిగూడూరులోని SNS కళాశాలలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. శ్రీ వేదాల నర్సింహాచార్యులు గారికి తన గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోనూ మనుషులు, జంతువులు విషసర్పాల కాటుకి గురైనప్పుడు, అరుదైన చికిత్సా నైపుణ్యంతో నిస్వార్థంగా ప్రాణాలు రక్షించిన ఘనత ఉంది. తన తండ్రి సేవా వారసత్వం నుంచి స్ఫూర్తి పొందిన శ్రీ వేదాల శ్రీనివాస్ గారు ఆ వారసత్వాన్ని విజయవంతంగా తీసుకువెళ్తున్నారు.శ్రీ వేదాల శ్రీనివాస్ గారి జీవన ప్రయాణం ఆయనకి ఆధ్యాత్మికతతో కూడిన దృక్పదాన్ని, సమాజం పట్ల ఉన్న అంకిత భావాన్ని మనకు సూచిస్తోంది.
ఆయన ప్రత్యేకమైన ైక్లెర్వాయంట్, సామర్థ్యాల నుంచి చలనచిత్ర నిర్మాణం, ఎగుమతి వ్యాపారంలో నాయకత్వం, ఒక వ్యక్తి అనేక రంగాలలో నిజమైన మార్పును తీసుకురాగలరని నిరూపించారు. బలమైన ఆధ్యాత్మిక విలువలు, సామాజిక కారణాల పట్ల నిబద్ధత ఆయన పనికి మరింత అర్థాన్ని జోడించాయి. సంప్రదాయాన్ని ఆధునికతతో, వ్యాపారాన్ని ఆధ్యాత్మికతతో, విజయాన్ని ఇతరులకు సహాయం చేయడం ద్వారా శ్రీ వేదాల శ్రీనివాస్ గారు తన స్వంత భవిష్యత్తును నిర్మించుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తున్నారు.‘విజయం అనేది వ్యక్తిగత విజయాల గురించి మాత్రమే కాదు, ప్రపంచంలో మనం చేసే మంచి మార్పు గురించి కూడా’ అని ఆయన జీవితం మనకు గుర్తు చేస్తుంది. …ఎడివిటి