దీర్ఘనిద్రలోకి దేవతలు!

రేపు తొలి ఏకాదశి
ఆషాఢశుక్ల ఏకాదశి తిథిని ‘తొలి ఏకాదశి’గా జరుపుకొంటాం. ‘దేవశయని, హరిశయని, పద్మా ఏకాదశి’గానూ దీనిని పిలుస్తాం. కొన్ని సంప్రదాయాల వారు ఇవాళ్టినుంచే ‘చాతుర్మాస్య వ్రతాన్ని’ కూడా ఆచరించడం మరో విశేషం. ఈనాటినుండి విష్ణుమూర్తితోసహా ముక్కోటి దేవతలంతా శయనించటం వల్లే దీనికి ‘శయని ఏకాదశి’ అనే పేరు వచ్చింది. దేవతలంతా మేల్కొనే ‘ఉత్థాన ఏకాదశి’ (కార్తీకమాసం) వరకు వారిని యజ్ఞయాగాదులకు ఆహ్వానించడం వీలు కాదు. కనుక, ఈ మధ్య కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వర్తించబడవు.
ప్రతి ఒక్కరూ తమ పాపకర్మలనుండి విముక్తులై తన దివ్యసన్నిధానాన్ని చేరడానికి ప్రతి ఏడూ వచ్చే ‘తొలి ఏకాదశి’ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా శ్రీకృష్ణుడు సూచించాడు.
‘భవిష్యోత్తర’ పురాణంలో ఈ ఏకాదశి విశేషాలు ఉన్నాయి. ఆషాఢశుక్ల ఏకాదశి మహిమను, వ్రతవిధి విధానాలను తెలుప వలసిందిగా యుధిష్టిర మహారాజు శ్రీకృష్ణుడిని కోరతాడు. దేవాదిదేవుని పలుకుల ప్రకారం, “ఒకానొకసారి నారద ముని కూడా బ్రహ్మదేవునితో ‘శయని ఏకాదశి’ విశిష్టతను తెలుపమని కోరాడు. మానవాళికి సర్వ శుభాల్ని చేకూర్చే ఈ ఏకాదశి గురించి తప్పక వివరిస్తానని బ్రహ్మదేవులవారు ఇలా వివరించారు. ‘ఈ ఏకాదశినాడు ఉపవాసం ఆచరించినవారు సమస్త పాపాలనుండి విముక్తులవడమేకాక వారి అన్ని అభీష్టాలనూ నెరవేర్చుకొన్న వారవుతారు. ఓ నారదా! ఈ ఏకాదశికి సంబంధించి శాస్ర్తాలలో తెలిపిన ఒక అద్భుతమైన చారిత్రక సంఘటననూ వివరిస్తాను.’
సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజర్షి ఒక రాజ్యాన్ని పాలించేవాడు. నిత్యం సత్యనిష్ఠతో ప్రజలందరినీ తన సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ ధర్మనిష్ఠను కలిగి వుంటాడు. దాంతో రాజ్యంలో ఎక్కడా కరువు కాటకాలు, వ్యాధులు ఉండవు. కానీ, ఒకసారి తన రాజ్యంలో జరిగిన ఓ ఘోర పాపకార్యం వల్ల మూడేండ్లపాటు తీవ్ర అనావృష్టి ఏర్పడింది. ఈ విపత్తునుండి ప్రజలను గట్టెక్కించటానికి అంగీరస ముని ఈ ‘ఏకాదశి వ్రతదీక్ష’ను సూచిస్తాడు. ఆ మేరకు, ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని రాజ్యంలోని ప్రజలంతా నిష్ఠగా ఆచరించి శ్రీహరిని ఆరాధించారు. దాంతో తిరిగి రాజ్యం తన పూర్వవైభవాన్ని సంతరించుకొంది.” ఇలా ప్రతి ఒక్కరూ తమ పాపకర్మలనుండి విముక్తులై తన దివ్యసన్నిధానాన్ని చేరడానికి ప్రతి ఏడూ వచ్చే ‘తొలి ఏకాదశి’ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా శ్రీకృష్ణుడు సూచించాడు.
వ్రత విధానం:
ఉపవాసం ముఖ్యోద్దేశ్యం ‘ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడి ప్రసన్నతయే’. ఈ తిథినాడు మరింత భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని ఆరాధనలో నిమగ్నం కావాలి. ఏ విధమైన తృణధాన్యాలనూ తినకూడదు. వీలైతే ఆహారాన్ని పూర్తిగా త్యజించాలి. ఉపవాసాన్ని ఆచరింపలేని వృద్ధులు తదితరులు పండ్లు, పాలు మొదలైన వాటిని మితంగా స్వీకరించవచ్చు. శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి పవిత్రమైన కృష్ణనామాలను కనీసం 108 సార్లు జపించాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

