తిరుమల : టీటీడీ నూతన జేఈవో (విద్య మరియు వైద్య) గా నియమితులైన డాక్టర్ ఏ.శరత్ ( A. Sharath ) ఆదివారం తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ, బోర్డు సెల్ ఏఈవో సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జేఈవో తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ నూతన జేఈవో (TTD JEO) ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.