Tirumala | మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ అదనపు ఈవో విజ్ఞప్తి
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కోరారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ( Website ) ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి కోరారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్సైట్లలో, మధ్యవర్తుల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించారు.
భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్సైట్లు, అక్రమ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అలాంటి వారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీవారి దర్శనం, వసతి, సేవల బుకింగ్‌లు, టికెట్ల విడుదల, రద్దు అయిన టికెట్ల లభ్యత, వివిధ దర్శనాల సమాచారం, వేచి ఉండే సమయం వంటి అన్ని వివరాలను టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.
ఎస్వీబీసీ ద్వారా కూడా భక్తులకు నిరంతరం అధికారిక సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్ నెం: 155257 సంప్రదించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు లేదా అనధికారిక వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని కోరారు. ఎవరైనా మధ్యవర్తులు, దళారులు , అనధికారిక వ్యక్తులు బుకింగ్‌ల పేరుతో సంప్రదించినట్లయితే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నెం: 98668 98630 సమాచారం అందించాలని కోరారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

