తిరుమల : భక్తగ్రేసరుడు వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భక్తులు రూ.2కోట్లు విరాళం ( TTD Donations) గా అందజేశారు. బెంగుళూరుకు చెందిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ ( Infra ) టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రవీణ్ ఎస్.నాయర్ తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణ కు విరాళం డీడీని అందజేశారు.

అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్( Devi Fisharies ) సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది. ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్కు విరాళం డీడీని అందజేశారు.