పశ్చాత్తాపం
ఒక భక్తుడు కొండ మీద ఉన్న గుడికి వెళ్లాలని గ్రామం నుంచి బయల్దేరాడు. దారిలో అతనికి ఓ యువకుడు తారసపడ్డాడు. తీవ్ర నిరాశగా కనిపించిన యువకుడితో ‘ఎందుకిలా ఉన్నావు?’ అని ప్రశ్నించాడు భక్తుడు. అతను తన కష్టాలన్నీ భక్తుడికి చెప్పుకొన్నాడు. ‘ఏం చేసినా కలిసిరావడం లేదు. పచ్చని చెట్టును తాకినా మండిపోయేలా ఉంది నా పరిస్థితి’ అని చెబుతూ బాధపడ్డాడు. అన్నీ విన్న భక్తుడు ‘నాతోపాటు కొండపైన ఉన్న గుడికి రా! స్వామిని దర్శించుకుందాం.
ఒక భక్తుడు కొండ మీద ఉన్న గుడికి వెళ్లాలని గ్రామం నుంచి బయల్దేరాడు. దారిలో అతనికి ఓ యువకుడు తారసపడ్డాడు. తీవ్ర నిరాశగా కనిపించిన యువకుడితో ‘ఎందుకిలా ఉన్నావు?’ అని ప్రశ్నించాడు భక్తుడు. అతను తన కష్టాలన్నీ భక్తుడికి చెప్పుకొన్నాడు. ‘ఏం చేసినా కలిసిరావడం లేదు. పచ్చని చెట్టును తాకినా మండిపోయేలా ఉంది నా పరిస్థితి’ అని చెబుతూ బాధపడ్డాడు. అన్నీ విన్న భక్తుడు ‘నాతోపాటు కొండపైన ఉన్న గుడికి రా! స్వామిని దర్శించుకుందాం. నీకు కొంత సాంత్వన చేకూరుతుంది’ అన్నాడు. ‘జనం కష్టాలు చూడలేకే కదా! దేవుడు కొండెక్కి కూర్చున్నాడు’ అని నిష్టూరమాడాడు యువకుడు.
‘ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు! కింద ఉంటే.. మనమూ, మన కష్టాలు సరిగ్గా కనిపించవని దేవుడు కొండపైకి చేరాడని ఎందుకు అనుకోకూడదు? దేవుడనే కాదు, నువ్వు తలపెట్టిన పనిని కూడా నమ్మకంతో చేయాలి. నిరాశా వాదాన్ని విడనాడి, సానుకూల ధోరణితో నమ్మి చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది’ అని హితవు పలికాడు భక్తుడు. యువకుడికి తన తప్పేంటో అర్థమైంది. అప్పటివరకు నిస్తేజంగా అడుగులు వేసిన అతను గబగబా గుడి మెట్లు ఎక్కడం ప్రారంభించాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

