మాట మంచిదైతే!
ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబుతూపోయాడు. అతనో ‘ఫిర్యాదుల పెట్టె’ అని గుర్తించాడు గురువు. చిన్నగా నవ్వి అతణ్ని పట్టణంలోని ప్రధాన కూడళ్ల దగ్గరికి వెళ్లమన్నాడు.
ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబుతూపోయాడు. అతనో ‘ఫిర్యాదుల పెట్టె’ అని గుర్తించాడు గురువు. చిన్నగా నవ్వి అతణ్ని పట్టణంలోని ప్రధాన కూడళ్ల దగ్గరికి వెళ్లమన్నాడు. ఆయా కూడళ్లలో రాజు స్థాపించిన శిల్పాలను, శిలా ఫలకాలను చూసి రమ్మన్నాడు. సాయంత్రం దాకా పట్టణమంతా చుట్టివచ్చిన యువకుడితో, చూసిన శిల్పాలు ఎవరివో పేర్లు చెప్పమన్నాడు గురువు. తను చూసిన ఎందరో మహానుభావుల శిల్పాల గురించి చెప్పాడు యువకుడు. ఓపికగా విన్న గురువు ఆ మహనీయులు చేసిన మంచి పనులేమిటో చెప్పమని అడిగాడు. వాటి గురించి మరింత గొప్పగా చెప్పాడు యువకుడు. అంతా విన్న గురువు చివరిగా ‘వీరిలో ఎవరైనా గొప్ప విమర్శకులు ఉన్నారా?’ అని అడిగాడు. లేదని సమాధానమిచ్చాడు యువకుడు. ‘ఎంతటి సహృదయత కలిగిన రాజైనా విమర్శకులకు శిల్పాలు పెట్టి, శిలాఫలకాలు రాయించరు. సన్మానాలు చేయరు.
మనకు నలుగురు కావాలంటే మన మాట మంచిగా ఉండాలి. మాటలతోనే కదా యుద్ధాలు మొదలయ్యేది. అన్నిటిలోనూ చెడునే చూడకూడదు. మంచి కూడా చూడాలి. అందరిలోనూ తప్పులు ఎంచుతూ, అన్ని విషయాల్లోనూ రంధ్రాన్వేషణ చేస్తూ పోతే… మనకంటూ ఎవ్వరూ మిగలరు’ అని హితబోధ చేశాడు. ‘నిజమే… ఏ నాణానికైనా బొమ్మాబొరుసూ రెండూ ఉంటాయి. బొరుసే చూస్తూ బొమ్మే లేదనుకుంటే ఎలా? విమర్శలు చేయడం తగ్గించుకుంటాను’ నిర్ణయించుకున్నాడు యువకుడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

