పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్కర్ వివరాల ప్రకారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పహాడీషరీఫ్‌లో నివాసముంటున్న కళావతి (16) మామిడిపల్లిలో 10వ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది.
25న రాత్రి 12 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. పలు చోట్ల వెతికినా ఆమె ఆచూకి లభించలేదు. పహాడీషరీఫ్‌లోనే నివాసముంటున్న అబ్ధుల్ రహమన్ అనే యువకుడు తన కూతురిని తీసుకెళ్లాడని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.