భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వినూత్న ప్రేమ కధ వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని బెయిల్‌పై బయటకు రప్పించేందుకు మహిళ అందినకాడికి అప్పులు చేయగా వాటిని తీర్చేందుకు ప్రియుడు మరో నేరానికి పాల్పడ్డాడు.
చెకింగ్‌లో భాగంగా విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ తెహ్జీబ్ క్వాజి యువకుడు విశాల్ ననేరియాను తనిఖీ చేశాడు. ఈ క్రమంలో అతడి పేరుతో ఇప్పటికే కేసు నమోదైనట్టు గుర్తించారు. దోపిడీ ఆరోపణలపై ననేరియాపై కేసు దాఖలైందని వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ననేరియా ప్రియురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అతడిని విడిచిపెట్టాలని స్టేషన్ ఇన్‌చార్జ్‌ను వేడుకుంది. మహిళను స్టేషన్ ఇన్చార్జ్ ప్రశ్నించగా విశాల్ జైలుకు వెళ్లిన ప్రతిసారీ అతడిని విడిపించేందుకు తాను అప్పులు చేస్తానని వాటిని తీర్చేందుకు తన ప్రియుడు మళ్లీ నేరాలకు పాల్పడుతుంటాడని ఆమె వాపోయింది.