మహిళా న్యాయవాదిపై కొడవలితో దాడి… అడ్డుకోబోయిన ఆమె కుమార్తెకూ గాయాలు
జమీలా బాను కేకలు వేయడంతో స్థానికులు పరుగున అక్కడకు వచ్చారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి కొడవలిని అక్కడ వదిలేసి పారిపోయాడు.
చెన్నై: మహిళా న్యాయవాదిపై ఒక వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఆమెతోపాటు అడ్డుకోయిన కుమార్తె కూడా గాయపడింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జమీలా బాను అనే మహిళా న్యాయవాది, కుమారన్ సలైలోని మనీలా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నది. రిసెర్చ్ కోసం పాత కేసులకు సంబంధించిన నోట్స్ తీసుకునేందుకు తన కుమార్తెతో కలిసి న్యాయవాదుల కార్యాలయానికి ఆమె వెళ్లింది. ఇంతలో ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా ఆ ఆఫీస్‌లోకి ప్రవేశించాడు. న్యాయవాది జమీలా బానుపై కొడవలితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది.
కాగా, జమీలా బాను కేకలు వేయడంతో స్థానికులు పరుగున అక్కడకు వచ్చారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి కొడవలిని అక్కడ వదిలేసి పారిపోయాడు. ఈ దాడిలో మహిళా న్యాయవాది జమీలా ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

