Viral Video: గన్స్‌తో బెదిరించి… ఆఫీస్ నుంచి కోటి దోపిడీ
ముంబై: గన్స్‌తో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు, ఒక ఆఫీస్ నుంచి కోటి రూపాయలు దోచుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ములుంద్‌లోని పంచ రాస్తా ప్రాంతంలో ఆర్థిక సేవలందించే ఒక సంస్థలోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. తుపాకులు చూపించి ఆ కార్యాలయంలోని ఉద్యోగులను బెదిరించారు. ఆ సమయంలో ఆ ఆఫీస్‌లో ఉన్న కోటి నగదును దోచుకున్నారు. రెండు బ్యాగుల్లో ఆ డబ్బులు పెట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
కాగా, ఈ దోపిడీ అంతా ఆ కార్యాలయంలోని సీసీటీవీలో రికార్డైంది. ఆ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దోపీడీకి పాల్పడ్డ వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు పట్ట పగలు, జన రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దోపిడీ జరుగడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH A case has been registered against 3 unidentified miscreants who robbed around Rs 1 crore from an office at 'gunpoint' in the Mulund area of Mumbai (02.02)
(Video Source: Mumbai Police) pic.twitter.com/vLoVdvrPcw
— ANI (@ANI) February 2, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

