
వికారాబాద్ : వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 15మంది రైతులు బుధవారం తెల్లవారు జామున తోల్కట్ట వద్ద జరిగిన ప్రమాదం పాఠకులకు విధితమే.. ఆదివారం హైదరాబాద్లోని ఆలీవ్ దవాఖానలో చికిత్సపొందుతూ పీరంపల్లి గ్రామానికి చెందిన రంగారెడ్డి(49), రాంచంద్రయ్య(42)లు మృతి చెందాడు. శుక్రవారం ఇద్దరు రైతులు మృతి చెందడంతో వారి అంత్యక్రియలు గ్రామస్తులు శనివారం నిర్వహించారు.
ఆదివారం మరో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. వీరి మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రఘాడ సానూభూతి తెలిపారు.