మామిడి కాయ కావాలని అడిగిన బాలిక… హత్య చేసిన మేనమామ
లక్నో: మామిడి కాయ కావాలని పదే పదే అడిగినందుకు ఒక బాలికను మేనమామ హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖేదా కుర్తాన్ గ్రామానికి చెందిన కూలీ కుమార్తె 5 ఏళ్ల ఖైరు నిషా, మంగళవారం మేనమామ ఉమరుద్దీన్ ఇంటికి వెళ్లింది. భోజనం చేస్తున్న అతడ్ని మామిడి కాయ కావాలని పదే పదే అడిగింది. దాని కోసం మేనకోడలు మారాం చేసి విసిగించడంపై మేనమామ ఆగ్రహం చెందాడు. ఆ చిన్నారి తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. అనంతరం కత్తితో బాలిక గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఇంట్లో దాచాడు.
మరోవైపు బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఉమరుద్దీన్ కూడా వారితో కలిసి వెతికేందుకు వెళ్లాడు. పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పారిపోయాడు.
కాగా, ఉమరుద్దీన్ ఇంట్లో సోదా చేసిన పోలీసులు గోనె సంచిలో ఉన్న బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం పారిపోయిన నిందితుడి కోసం గాలించారు. సమీప అటవీ ప్రాంతంలో ఉన్న ఉమరుద్దీన్ను గురువారం అరెస్ట్ చేశారు. బాలిక హత్యకు వినియోగించిన కత్తి, ఐరన్ రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

