తెలుగుయూనివర్సిటీ : గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…
లింగంపల్లి-చందానగర్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం సమయంలో సుమారు 60సంవత్సరాల వ్యక్తి పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించారు.
జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా నిర్థారించి పంచనామా నిర్వహించి ఉస్మానియా దవఖాన మార్చురీకి తరలించి భద్రపరిచి కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుని శరీరంపై బ్లూ రంగు షర్టు, లుంగీ ధరించి ఉన్నాడన్నారు. వివరాలకు 040-23202238, 9848349544నెంబర్లో సంప్రదించవచ్చన్నారు.