West Bengal | అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. బ్యాగ్‌లో కుమారుడి మృతదేహంతో 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాడు
West Bengal | పశ్చిమబెంగాల్ (West Bengal)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ (ambulance)కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు.
West Bengal | పశ్చిమబెంగాల్ (West Bengal)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ (ambulance)కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు.
రాష్ట్రంలోని కలియాగంజ్ (Kaliaganj) ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మ ( Asim Devasharma) అనే వలస కార్మికుడికి (migrant worker ) ఐదు నెలల వయసు ఉన్న కవల పిల్లలు ఉన్నారు. ఇటీవల ఇద్దరు పిల్లలూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కలియాగంజ్ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆ చిన్నారులను సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ (North Bengal Medical College) ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. దీంతో ఆ బిడ్డను దేవశర్మ భార్య గురువారం ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతున్న మరో కుమారుడు గత శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అంబులెన్స్ కోసం వెళ్లగా.. డ్రైవర్లు రూ.8 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో చేసేదేమీ లేక చిన్నారి మృతదేహంతో బస్టాండ్‌కు పయనమయ్యాడు. మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచి సుమారు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కలియాగంజ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు.
ఈ ఘటనపై దేవశర్మ మాట్లాడుతూ.. ‘ఆరు రోజుల చికిత్స తర్వాత నా ఐదు నెలల బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని ఆసుపత్రి సిబ్బందిని అడిగా. అయితే, ఇందు కోసం అంబులెన్స్ డ్రైవర్లు రూ.8వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు నా వద్ద లేదు. దీంతో కుమారుడి మృతదేహంతో బస్సులో వెళ్లాను. మృతదేహంతో బస్సు ఎక్కితే.. ప్రయాణికులు, సిబ్బంది దించేస్తారని భయపడ్డా. అందుకే ఎవరికీ తెలీకుండా నా ఐదు నెలల కుమారుడి మృతదేహాన్ని బ్యాగులో దాచా. కలియాగంజ్‌లోని వివేకానంద కూడలిలో దిగి.. అక్కడ ఓ వ్యక్తిని సంప్రదించగా అతడు నాకు అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నా’ అని దేవశర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read..
Siddaramaiah | తదుపరి సీఎంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశాలు..?
spurious liquor | కల్తీ మద్యం తాగి 13 మంది మృతి.. 30 మందికి అస్వస్థత
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

