Amitabh Bachchan | ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అమితాబ్ బచ్చన్.. లిఫ్ట్ అడిగి లొకేషన్‌కు చేరుకున్న బిగ్‌బీ
Amitabh Bachchan | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్‌బీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. సమయ పాలనను కచ్చితంగా పాటిస్తారు.
Amitabh Bachchan | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్‌బీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. సమయ పాలనను కచ్చితంగా పాటిస్తారు. ఏ విషయంలోనైనా ఆలస్యం చేయడాన్ని ఆయన అస్సలు సహించరు. షూట్ లొకేషన్‌కు కూడా ఇన్‌టైమ్‌లోనే వెళ్తుంటారు. అందరి కంటే ముందే అక్కడ వాలిపోతుంటారు. అయితే ఇటీవల బిగ్ బీ షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చాలా సేపటి వరకూ రోడ్డుపై అలానే ఉండిపోయారు.
దీంతో షూట్‌కి ఆలస్యం అవుతుందని గ్రహించిన బిగ్‌బీ.. ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి బైక్‌పై అనుకున్న సమయానికి షూటింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం తనకి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ మిత్రమా. నువ్వు ఎవరో నాకు తెలీదు. కానీ సమయానికి లిఫ్ట్ ఇచ్చి నన్ను షూటింగ్ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు’ అంటూ తనకు సాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బిగ్‌బీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ (Project K)లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు (Prabhas) జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది.
Also Read..
India Corona | వెయ్యికి లోపే కొత్త కేసులు.. 14 వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు
Cyclone Mocha | బంగ్లా, మయన్మార్‌ను వణికిస్తోన్న మోచ తుఫాను.. అల్లకల్లోలంగా మారిన రెండు దేశాలు
Siddaramaiah | తదుపరి సీఎంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశాలు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

