Crime | అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత, ఇద్దరి అరెస్ట్

మెహిదీపట్నం : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని హబీబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం….మంగళ్‌హాట్ మచిలీపురాకు చెందిన జె అనిల్‌సింగ్ (47), జె శంకర్‌సింగ్(42) మంగళవారం ఉదయం సీతారాంబాగ్ ఫ్రెండ్స్ కేఫ్ ప్రాంతం నుంచి అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకుని సోదా చేశారు.
వారి వద్ద ఉన్న ట్రావెల్స్ బ్యాగులలో రెండు కిలోల రెండు వందల యాభై గ్రాముల గంజాయి లభ్యమైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును హబీబ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

