అహ్మదాబాద్ : ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన ట్రైనీ ఎయిర్‌హోస్టెస్‌కు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉదంతం అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. నిందితుడు లైంగిక దాడి దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసి వీడియో క్లిప్‌ను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ యువతి(22)పై పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డాడు. బాధితురాలు ఫిర్యాదుపై నిందితుడు అజిత్ త్రివేది (22)ని నగరంలోని వెజాల్పూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
త్రివేదితో ఏడు నెలల కిందట తనకు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైందని, ఆపై వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని బాధితురాలు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో యువతిని తన ఇంటికి రావాలని త్రివేది కోరాడు. ఆపై ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
ఆమె స్రృహ కోల్పోగానే నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో ఈ దృశ్యాలను రికార్డు చేసిన నిందితుడు వాటిని చూపుతూ తర్వాత పలుమార్లు ఇదే నేరానికి తెగబడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.