న్యూఢిల్లీ : గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఆపీసర్నని చెబుతూ ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఎంటరైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలీఘడ్‌లో నివసించే గౌరవ్ ఈనెల 22న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి ప్రవేశించాడు. వ్యూహాత్మకంగా సెన్సిటివ్ జోన్లో ఉన్న కాంపౌండ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గౌరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఎంట్రీగేట్ వద్ద గౌరవ్‌ను అడ్డుకున్న భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపాలని కోరారు. భద్రతాధికారులకు సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సంస్ధలో యూనిఫాంలో సెల్పీ తీసుకునేందుకే తాను ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి వచ్చానని దర్యాప్తులో అంగీకరించాడు.
తాను ఐఏఎఫ్ అధికారిని అని తన గర్ల్‌ఫ్రెండ్ నమ్మకపోవడంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకే ఈ పనిచేశానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. నిందితుడిని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.