Road Accident in Warangal | వరంగల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద దుర్ఘటన చోటు చేసుకున్నది. మృతులను కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయిరెడ్డిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి వరంగల్ వస్తుండగా డీసీ తండా వద్ద ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.