QR Code Scam | క్యూఆర్ కోడ్ స్కామ్ బారినపడకుండా ఉండాలంటే..!
క్యూఆర్ కోడ్ (QR Code Scam) స్కాన్ చేసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితుల నుంచి డబ్బు కాజేసేందుకు స్కామర్లు నకిలీ క్యూఆర్ కోడ్స్ క్రియేట్ చేసి అమయాకులను అడ్డంగా దోచేస్తున్నారు.
న్యూఢిల్లీ : క్యూఆర్ కోడ్ (QR Code Scam) స్కాన్ చేసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితుల నుంచి డబ్బు కాజేసేందుకు స్కామర్లు నకిలీ క్యూఆర్ కోడ్స్ క్రియేట్ చేసి అమయాకులను అడ్డంగా దోచేస్తున్నారు. పేమెంట్ రిసీవ్ చేసుకునే క్రమంలో స్కామర్లు పంపిన నకిలీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పలువురు మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
స్కామర్లు పంపిన కోడ్‌ను స్కాన్ చేసి ఓటీపీ ఎంటర్ చేయగానే తమ ఖాతాల నుంచి డబ్బు డిడక్ట్ అయిన మెసేజ్‌లు వస్తుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ దైనందిన జీవితంలో పేమెంట్స్‌కు అనివార్యం కావడంతో సైబర్ నేరగాళ్లు దీన్ని అవకాశంంగా మలుచుకుని ఆన్లైన్ వేదికగా చెలరేగుతున్నారు. ఇక క్యూఆర్ కోడ్ స్కామ్ బారినపడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
మీ యూపీఐ ఐడీ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ కొత్త వ్యక్తులతో పంచుకోరాదు. ఇక క్యూఆర్ కోడ్స్ ముఖ్యంగా డబ్బు పంపడానికే కానీ రిసీవ్ చేసుకోవడానికి కాదని గుర్తించాలి. అప్పటికే ఉన్న కోడ్స్‌పై అతికించిన స్టిక్కర్లు వంటి అనుమానిత క్యూఆర్ కోడ్స్‌ను అవాయిడ్ చేయాలి. ఆన్లైన్ వేదికలపై పేమెంట్ చేసే ముందు విక్రేతకు సంబంధించిన వివరాలను పరిశీలించాలి. అవసరమైతే తప్ప మీ మొబైల్ నెంబర్ వివరాలను షేర్ చేయరాదు.
Read More :
Pindam Movie | గర్భిణీ స్త్రీలు ఈ సినిమా చూడవద్దన్న సెన్సార్ బోర్డు.!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

