కాచిగూడ : చాదర్‌ఘాట్ మూసీ నాలాలో కార్పేంటర్ గల్లంతైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్, ఎస్సై బి.నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాత మలక్‌పేటలోని శంకర్‌నగర్ ప్రాంతానికి చెందిన కార్పెంటర్ మహ్మాద్ జహంగీర్ (38) శుక్రవారం ఉదయం మూసి నాలాలో ఈత కొట్టడానికి వచ్చాడు.
మద్యం మత్తులో స్నానం చేసిన జహంగీర్ బయటకు వస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదావశాత్తు జహంగీర్ నాలాలో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మూడు గంటల పాటు గాలించిన ఫలితం లేదు. కాచిగూడ పోలీసులు, జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్ టీంలు నాలాలో వెతికినా జహంగీర్ మృతదేహం కన్పించలేదని పోలీసులు పేర్కొన్నారు.