బంజారాహిల్స్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వాక్‌వేలో ఓ మహిళా వాకర్‌ను వేధించిన వ్యక్తికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో నివాసం ఉండే పి. రాందాస్ (36) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు.
గత నెల 31న రాందాస్ తన వెంట పడి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేదిస్తున్నాడని ఓ మహిళా వాకర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు రాందాస్‌ను అదుపులోకి తీసుకొని 70(బి), 70(సి)సీపీ యాక్ట్ కింద పెట్టీ కేసు నమోదు చేసి నాంపల్లిలోని పదవ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కిషన్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆ నిందితుడికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.