హైదరాబాద్ : నగరంలోని మీర్పేట పోలీస్ స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.