Tennis Player Shot Dead : టెన్నిస్ ఆటలో గొప్పగా రాణించాలనుకున్న ఓ యువ క్రీడాకారిణి జీవితం అర్థాంతరంగా ముగిసింది. రాష్ట్ర స్థాయిలో (State Level) పతకాలు సాధిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో మెరవాలనుకున్న ఆమె కన్నతండ్రే కడతేర్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుందనే కోపంతో ఏకంగా ఐదు రౌండ్లు కాల్పులు జరిపి ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. రాకెట్‌నే ప్రాణంగా భావించి.. అద్భుత విజయాలతో పలు ట్రోఫీలు సాధించిన ఆ అమ్మాయి పేరు రాధికా యాదవ్.
టెన్నిస్ తారగా పేరొందని రాధిక కుటుంబంతో కలిసి గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్‌లో నివసించేది. ఆమె అందరూ టీనేజర్ల మాదిరిగానే స్మార్ట్ ఫోన్లో.. ముఖ్యంగా ఇన్‌స్టాలో ఎక్కువ సమయం గడిపేది.అయితే.. ఎన్నిసార్లు వారించినా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం మానడం లేదనే నెపంతో రాధిక తండ్రి గురువారం తుపాకీతో ఆమెను కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. కన్న కూతురిని అమానుషంగా హత్య చేసిన అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
A 25-year-old state-level tennis player, Radhika Yadav, was allegedly shot dead by her own father in Gurugram on Thursday afternoon.
The incident occurred at around 12 noon inside their family residence located in Sector 57, where Radhika lived with her family.
According to… pic.twitter.com/1YoDEHeCBG
— IndiaToday (@IndiaToday) July 10, 2025
చిన్న వయసులోనే రాకెట్ అందుకున్న రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ ప్లేయర్. పలు టోర్నీల్లో విజేతగా నిలిచిన ఆమె జాతీయ స్థాయిలో రాణించాలని ఎన్నో కలుల కన్నది. కానీ, ఆ యువకెరటం కలల్ని ఆమె తండ్రి కల్లలు చేశాడు. కూతరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాయలో పడిందని.. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని రాధికపై అతడు కోపం పెంచుకున్నాడు. అంతే.. అతడిలో ఆమెపై మమకారం వదిలేసి.. తుపాకీతో కాల్చి చంపాడు. ప్రతిభావంతురాలైన రాధిక హత్యకు గురైందనే వార్త తెలిసి అందరూ షాక్‌కు గురవుతున్నారు.