కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్ కాలనీలో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ తూర్పు కార్తిక అలియాస్ శిరీష (31) అనే వివాహిత ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్తింటి, వేధింపులు భరించలేక శిరీష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. 8 ఏండ్ల క్రితం శిరీష , హరిప్రసాద్ కు వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా ఇద్దరూ కూడా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు.
తమ కూతురిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని శిరీష తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న కామారెడ్డి రూరల్ పోలీసులు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు.